Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. గురించి పరిచయ వాక్యాలు కానీ, ఎలివేషన్స్ కానీ అవసరం లేదు. ఆయన ఏది మాట్లాడినా సంచలనమే.. ఎక్కడ ఉన్న ప్రభంజనమే. పవన్ కు అభిమానులు ఉండరు భక్తులు మాత్రమే ఉంటారు అన్న విషయం అందరికి తెలిసిందే. ఇక గత కొన్నాళ్లుగా పవన్ రాజకీయాల్లో ఉంటున్న విషయం తెల్సిందే. వైట్ అండ్ వైట్ డ్రెస్సుల్లో మాత్రమే కనిపించేవాడు. ఎక్కడకు వెళ్లినా పంచెకట్టుతోనే దర్శనమిచ్చేవాడు. దీంతో పవన్ ఫ్యాన్స్..ఆయన స్వాగ్ ను మిస్ అవుతూ వచ్చారు. ఇక కొన్నిరోజులుగా పవన్ అల్ట్రా స్టైలిష్ లుక్ తో అదరగొట్టేస్తున్నాడు. ఆయనను అలా చూస్తూ ఫ్యాన్స్ మైమరిచిపోతున్నారు. పవన్ ఎక్కువ బ్లాక్ హుడీస్ లో దర్శనమిస్తూ ఉంటాడు. ఇక మొన్నటికి మొన్న ముంబైలో బ్లాక్ హుడీ తో OG సెట్లో ఉస్తాద్ లా అడుగుపెట్టాడు. ఆ ఫొటోలే ఇంకా ట్రెండింగ్ నుంచి దిగలేదు. తాజాగా ఉస్తాద్ మరో ఫోటో ట్విట్టర్ ను షేక్ చేస్తోంది.
Keerthy Suresh: కీర్తి పెళ్ళెప్పుడు అంటే.. ఆ రేంజ్ లో సమాధానమిచ్చిందేంటి
OG.. సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తున్న విషయం తెల్సిందే . ప్రమోషన్స్ ఎలా చేయాలో దానయ్యకు తెలిసినంతగా ఇంకొకరికి తెలియదు. అందుకు ఆర్ఆర్ఆర్ యే ఉదాహరణ. సాధారణగా ఏ ప్రొడక్షన్ హౌస్ అయినా సెట్ లో ఫొటోస్ లీక్ చేయకూడదు, హీరోల ఫోటోలు రివీల్ చేయకూడదు అని చూస్తారు. కానీ, డీవీవీ దానయ్య మాత్రం.. OG సెట్ నుంచి నిత్యం ఏదో ఒక ఫోటోను హెచ్ డి లో రిలీజ్ చేస్తూ అంచనాలను పెంచేస్తున్నారు. తాజాగా ఈ సెట్ లో పవన్ కొత్త ఫోటోను మేకర్స్ రిలీజ్ చేశారు. క్యాజువల్ గా షూటింగ్ కు ముందో, షూటింగ్ తర్వాతనో కార్ వ్యాన్ ను అనుకోని ఫోన్ మాట్లాడుతున్న పవన్ ను అనుకోకుండా క్లిక్ చేసి.. క్యాండీడ్ ఫోటో గా రిలీజ్ చేశారు. ఇక అంత క్యాజువల్ లుక్ లో కూడా పవన్ స్వాగ్ మాములుగా లేదు. కాలు మీద కాలు పెట్టి, క్యార్ వ్యాన్ ఫై చెయ్యి మోచేయి ఆనించి.. పవన్ అలా కనిపిస్తుంటే.. పవర్ స్టార్.. అంటే ఇది. రాజు ఎక్కడ ఉన్నా రాజే అన్నట్టు.. పవన్ ఎలా నిలబడినా అందులో స్వాగ్ కనిపిస్తుంది. ఆయన ఊరికే అలా నిలబడినా చాలు.. ట్విట్టర్ షేక్ అయిపోతుంది అంటూ అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది.
