NTV Telugu Site icon

Pawan Kalyan: షారుఖ్ కంటే నాకే ఎక్కువిస్తానన్నారు.. పవన్ కామెంట్స్ వైరల్

Shahrukh Khan Pawan Kalyan

Shahrukh Khan Pawan Kalyan

Pawan Kalyan Intresting Comments on Shah Rukh Khan Coco Cola: పవర్ స్టార్ గా ఒక పక్క సినిమాలు చేస్తూనే జనసేన అధినేతగా మరోపక్క రాజకీయం కూడా చేస్తున్నారు పవన్ కళ్యాణ్. 2014లో జనసేన పార్టీని స్థాపించిన ఆయన ఆ ఎన్నికల్లో పోటీ చేయకుండా బిజెపి, తెలుగుదేశం కూటమికి మద్దతు పలికారు. 2019 ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేస్తే కేవలం ఒకే ఒక సీటు దక్కింది. ఆయన కూడా ఓడిపోవడంతో ఎన్నో అవమానాలు పాలైనా సరే 2024లో మరోసారి బిజెపి -టిడిపి- జనసేన కూటమిగా ఏర్పడి ఎన్నికలకు వెళుతున్నారు. అయితే ఎన్నికల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ మీడియా సంస్థలకు ఇంటర్వ్యూస్ ఇస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కేవలం లోకల్ మీడియా సంస్థలకు మాత్రమే కాదు, నేషనల్ మీడియా సంస్థలు సైతం పవన్ కళ్యాణ్ తో ముఖాముఖి ఇంటర్వ్యూలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఒక ఇంటర్వ్యూలో ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Geetha Bhagath: హీరో కడతాడని చీర కట్టుకు రాలేదు.. యాంకర్ షాకింగ్ కామెంట్స్

తనకు డబ్బు మీద ఆశ లేదని పవన్ కళ్యాణ్ కామెంట్ చేశారు. అదే ఉంటే కొన్ని వేల కోట్లు సంపాదించి ఉండేవాడినని అన్నారు. ఇక తాను ఫస్ట్ లో కోకో కోలాకి బ్రాండ్ అంబాసిడర్ గా ఉండేవాడినని అయితే అది తాగడం వల్ల కొన్ని నెగిటివ్ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని తెలిసి తాను తప్పుకున్నానని అన్నారు. అయితే తాను కనుక తప్పుకోకుండా కంటిన్యూ అయితే కనుక అప్పటి బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ కి ఇచ్చే డబ్బు కంటే రెట్టింపు ఇస్తామని అన్నారని కానీ జనాల ఆరోగ్యాన్ని ఇబ్బంది పెట్టే ఆ ప్రోడక్ట్ ని తాను ప్రమోట్ చేయడం కరెక్ట్ కాదని భావించానని చెప్పుకొచ్చారు. అప్పటి నుంచి తాను కొన్ని విలువలు పెట్టుకొని దేని నుంచి డబ్బులు సంపాదించాలో దాని నుంచే సంపాదిద్దాం అని ఫిక్స్ అయి సినిమాలే చేసుకున్నాను అని పవన్ అన్నారు. నిజానికి పవన్ మిగతా హీరోస్ తో పోలిస్తే ఏ బ్రాండ్స్ కి అంబాసిడర్ లా వ్యవహరించడం లేదు. కేవలం ఆయన చేనేత వస్త్రాలకు మాత్రమే బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తూ ఉంటారు.

Show comments