NTV Telugu Site icon

Pawan Kalyan: ఒక్క పోస్టు కూడా లేకుండానే పవన్ కళ్యాణ్ సెన్సేషనల్ రికార్డు.. కానీ?

Pawan Kalyan Instagram Account Reaches One Million Followers In 6 Hours

Pawan Kalyan Instagram Account Reaches One Million Followers In 6 Hours

Pawan Kalyan’s instagram account followers: తెలుగులో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు ఉండే క్రేజ్ ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. చిరంజీవి తమ్ముడిగా ఆయన తెలుగు ప్రేక్షకులను పరిచయం అయినా తనకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పరచుకున్నాడు. ఇక ఇప్పుడు జనసేన పార్టీ కూడా స్థాపించి ఆయన ప్రజా సేవకు సిద్దమయ్యారు. అయితే నిన్నటి వరకు ఫేస్‌బుక్, ట్విట్టర్ లో మాత్రమే యాక్టివ్ గా ఉన్న పవన్ కళ్యాణ్ మంగళవారం నాడు ఇన్‌స్టాగ్రామ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఉదయం ఆయన ఖాతా తెరిచిన కాసేపటికే వెరిఫై కూడా అవడంతో ఖాతాను ప్రారంభించిన గంటల్లోనే మిలియన్ ఫాలోవర్స్ దాటేశారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే పవన్ కళ్యాణ్ సింగిల్ పోస్ట్ కూడా అందులో పోస్ట్ చేయకుండానే ఆయనకు ఫాలోవర్స్ పెరిగిపోయారు, పెరిగిపోతూనే ఉన్నారు. అలా ఒక్క పోస్ట్ కూడా లేకుండా ఆయన 6 గంటల్లో 1 మిలియన్ ఫాలోయర్స్ కౌంట్ దాటేశాడు.

Double Ismart: పూరీ-రామ్ సినిమాకి ముహూర్తం ఫిక్స్.. ఆరోజు నుంచే రెగ్యులర్ షూట్?

ఆ లెక్కన ఒక్క పోస్ట్ కూడా లేకుండా 1 మిలియన్ ఫాలోయర్స్ ని దక్కించుకున్న ఏకైక ఇండియన్ సెలబ్రిటీ గా పవన్ కళ్యాణ్ చరిత్ర సృష్టించాడని అభిమానులు సోషల్ మీడియాలో కాలర్ ఎగరేస్తున్నారు. అయితే నిజానికి తలపతి విజయ్ ఇన్‌స్టాగ్రామ్ ఎంట్రీ సమయంలో ఒక రికార్డ్ సెట్ చేశారు. ఈ ఏడాది ఏప్రిల్ 2న సాయంత్రం 4 గంటల సమయంలో ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఖాతా తెరవగా కేవలం 99 నిమిషాల్లోనే 1 మిలియన్ ఫాలోవర్లను సాధించాడు. ఇక BTS V (53 నిమిషాలు), ఏంజెలీనా జోలీ (59 నిమిషాలు) తర్వాత 1 మిలియన్ ఫాలోవర్లను చాలా వేగంగా మూడవ ఫాస్టెస్ట్ ఫాలోవర్స్ సంపాదించిన అకౌంట్ గా నిలిచింది. అయితే ఆరోజున విజయ్ ఒక ఫోటో పోస్ట్ చేశారు. కానీ పవన్ కళ్యాణ్ ఎలాంటి పోస్టు చేయకుండానే మిలియన్ ఫాలోవర్స్ ను సాధించారు. ఇక 24 గంటల్లో పవన్ కూ ఏ రేంజ్ ఫాలోవర్స్ రాబోతున్నారో చూడాలి.

Show comments