Site icon NTV Telugu

HHVM : వీరమల్లు రిలీజ్ డేట్ అప్పుడేనా.. పవన్ ఫిక్స్ అయ్యారా..?

Harihara Veeramallu

Harihara Veeramallu

HHVM : పవన్ కల్యాణ్‌ నుంచి సినిమా వచ్చి చాలా కాలం అవుతోంది. మరీ ముఖ్యంగా హరిహర వీరమల్లు విషయంలో ఆలస్యం అవుతూనే ఉంది. ఈ మూవీ అప్పుడెప్పుడో మొదలైంది. డైరెక్టర్ కూడా మారిపోయినా.. రిలీజ్ విషయంలో లేట్ అవుతోంది. మే 9న రిలీజ్ చేస్తామని ఆ మధ్య మూవీ టీమ్ ప్రకటించినా.. చివరకు అది క్యాన్సిల్ అయింది. జ్యోతికృష్ణ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. సోషియో ఫాంటసీ నేపథ్యంలో వస్తుండటంతో పాటు.. ఇందులో పవన్ లుక్, కాస్ట్యూమ్స్, విజువల్స్ అంచనాలను పెంచేశాయి. పైగా పవన్ చేస్తున్న మొదటి పాన్ ఇండియా సినిమా కూడా ఇదే. అందుకే అంచనాలు పెరిగాయి.
Read Also : Madhubala: హీరోయిన్ మధుబాల లవ్ స్టోరీ.. అండర్‌వరల్డ్‌తో సంబంధం?

కానీ రిలీజ్ డేట్ ఆలస్యం అవుతుండటంతో పవన్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురవుతున్నారు. దీంతో పవన్ తాజాగా మూవీ రిలీజ్ డేట్ పై డైరెక్టర్, నిర్మాతతో మాట్లాడినట్టు తెలుస్తోంది. మే రెండో వారం లేదా మూడో వారంలో రిలీజ్ చేయాలని ఫిక్స్ చేశారంట. దీనిపై అతి త్వరలోనే అఫీషియల్ ప్రకటన వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. షూటింగ్ దాదాపు పూర్తి చేసుకున్న ఈ మూవీ.. పోస్ట్ ప్రడక్షన్ పనులు మాత్రమే మిగిలి ఉన్నాయంట. వాటిని వీలైనంత త్వరగా ఫినిష్ చేసి రిలీజ్ చేయాలని పవన్ సూచించారంట. దీంతో మూవీ టీమ్ పెండింగ్ పనులను పూర్తి చేస్తోంది. మరి ఈ సారి అయినా అనుకున్న టైమ్ కు వస్తారా లేదా అన్నది మాత్రం చూడాలి.

Exit mobile version