Site icon NTV Telugu

OG : ఓజీ కోసం ముంబైకి పవన్..?

Pawan Kalyan

Pawan Kalyan

OG : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ నటిస్తున్న ఓజీకి మళ్లీ మంచి రోజులు వచ్చాయి. చాలా నెలల తర్వత ఈ మూవీ కోసం పవన్ కల్యాణ్‌ డేట్స్ కేటాయించారు. దాంతో శరవేగంగా షూటింగ్ జరిపేందుకు డైరెక్టర్ సుజిత్ ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇందుకోసం ముంబైలో ఓ భారీ షెడ్యూల్ ను ప్లాన్ చేశాడంట ఈ ట్యాలెంటెడ్ డైరెక్టర్. త్వరలోనే దాని కోసం పవన్ కల్యాణ్‌ ముంబైకి వెళ్లబోతున్నారంట. ఈ వారం ఏపీలో కేబినెట్ మీటింగ్ ఉంది. అందులో కీలక అంశాలు చర్చిస్తారు.

Read Also : Off The Record: అక్కడ కూటమిలో 3 పార్టీలకు బదులు 4 పార్టీలు ఉన్నాయా?

దాని తర్వాత ముంబైకు వచ్చేవారం మొదట్లో పవన్ వెళ్తారు. అక్కడే రెండు వారాల పాటు ఉంటారని తెలుస్తోంది. అవసరం అనుకుంటే మధ్యలో ఏపీకి వచ్చి తిరిగి ముంబైకి వెళ్తారంట. వీలైనంత త్వరగా షూటింగ్ కంప్లీట్ చేయాలని పవన్ చూస్తున్నారు. ఇప్పటికే కొంత వరకు షూటింగ్ కంప్లీట్ అయింది. కాబట్టి మిగతా షూటింగ్ లో.. పవన్ ఉండే సీన్లు అన్నీ కంటిన్యూగా ప్లాన్ చేసుకున్నాడంట డైరెక్టర్. పవన్ షూట్ అయిపోయిన తర్వాత మిగతా సీన్లను పూర్తి చేస్తాడంట. సెప్టెంబర్ 25న మూవీని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Read Also : Devara : ‘చుట్టమల్లే’ సాంగ్ కు గుర్తింపు దక్కలేదు.. కొరియోగ్రాఫర్ కామెంట్స్..

Exit mobile version