NTV Telugu Site icon

Pawan Kalyan: మూడో భార్యకు విడాకులు.. క్లారిటీ ఇచ్చిన పవన్

Pawan

Pawan

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను సంబంధించిన ఏ వార్త వచ్చినా.. సోషల్ మీడియాలో ఇట్టే వైరల్ గా మారిపోతూ ఉంటుంది. అందులో నిజం ఎంత..? అబద్దం ఎంత.. ? అనేది ఎవరు చూడరు. పవన్ అంటే గిట్టని వారు విమర్శిస్తారు.. ఇష్టం ఉన్నవారు సమర్థిస్తారు. ఇక గత మూడు రోజులుగా పవన్ కళ్యాణ్.. తన మూడో భార్య అనా లెజినోవాకు విడాకులు ఇస్తున్నాడని ఒక వార్త సోషల్ మీడియాను కుదిపేసింది. అనా లెజినోవా.. పవన్ ను వదిలి సింగపూర్ కు వెళ్లిపోయిందని, పిల్లలతో కలిసి అక్కడే ఉంటుందని వార్తల్లో రాసుకొచ్చారు. దీంతో పవన్ ను విమర్శించేవారు ఎక్కువైపోయారు. మూడో పెళ్లి కూడా పెటాకులే అని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. అయితే ఈ రూమర్స్ కు పవన్ చెక్ పెట్టాడు. తాజాగా పవన్ పార్టీ అయిన జనసేన అధికారిక ట్విట్టర్.. పవన్ పెళ్లి వార్తలను ఖండిస్తూ.. పవన్ – అన్నా లెజినోవా కలిసి ఉన్న ఫోటోను షేర్ చేస్తూ.. విడాకులు రూమర్స్.. ఖచ్చితంగా పుకార్లు మాత్రమే అని తేల్చి చెప్పేసింది.

Ram Charan: ఫ్యాన్స్ ను పిచ్చోళ్లను చేస్తున్న హీరోలు.. ఎమోషన్స్ తో గేమ్స్ ఆడుతున్నారు

“జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, శ్రీమతి అనా కొణిదెల గారు – వారాహి విజయ యాత్ర తొలి దశ దిగ్విజయంగా పూర్తి చేసుకొన్న సందర్భంగా హైదరాబాద్ లోని తమ నివాసంలో నిర్వహించిన పూజాదికాలలో పాల్గొన్నారు. శాస్త్రోక్తంగా చేపట్టిన ఈ ధార్మిక విధులను శ్రీ పవన్ కళ్యాణ్, శ్రీమతి అనా కొణిదెల దంపతులు నిర్వర్తించారు. కొద్ది రోజుల్లో వారాహి విజయ యాత్ర తదుపరి దశ మొదలవుతుంది. ఇందుకు సంబంధించిన సన్నాహక సమావేశాల్లో పాల్గొనేందుకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు త్వరలో మంగళగిరి చేరుకుంటారు” అంటూ సమాచారం కూడా అందించింది. భర్త విజయ యాత్ర విజయవంతంగా పూర్తిచేసిన వెంటనే పూజ చేసి మరీ దేవుడి ఆశీర్వాదాలు తీసుకున్న ఆమెను ఇలా విడాకుల పేరుతో అవమానించడం ఏంటని పవన్ అభిమానులు ట్రోలర్స్ పై ఘాటుగా స్పందిస్తున్నారు. ఈ ఒక్క క్లారిటీతో విడాకుల రూమర్స్ కు చెక్ పడినట్లే అని అభిమానులు చెప్పుకొస్తున్నారు.