Site icon NTV Telugu

Pawan Kalyan: తొలిప్రేమ దెబ్బకి దద్దరిల్లిన సంధ్య 70MM…

Tholiprema

Tholiprema

మెగా బ్రదర్ పవన్ కళ్యాణ్ ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గా మార్చిన మొదటి సినిమా ‘తొలిప్రేమ’, ఈ మూవీకి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆల్ టైమ్ క్లాసిక్ స్టేటస్ ఉంది. కరుణాకరన్ డైరెక్ట్ ఈ మూవీ లవ్ స్టోరీ సినిమాలకే ఒక బెంచ్ మార్క్ లాంటిది. 1998లో రిలీజ్ అయిన ఈ మూవీ గురించి ఈ రోజుకీ మాట్లాడుకుంటున్నాం అంటే తొలిప్రేమ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. ఈ మనస్సే, ఏమి సోదరా మనసుకి ఏమైందిరా, గగనానికి ఉదయం ఒకటే… లాంటి సాంగ్స్ తో తొలిప్రేమ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ దేవా ప్రాణం పోసాడు. బెస్ట్ ఫిలింగా నేషనల్ అవార్డుతో పాటు చాలా కేటగిరిల్లో నంది అవార్డుని గెలుచుకుంది తొలిప్రేమ సినిమా.

బాలుగా పవన్ కళ్యాణ్, అను పాత్రలో కీర్తి రెడ్డి ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసారు. ముఖ్యంగా అను క్యారెక్టర్ ఇంట్రడక్షన్ సీన్ కి ఇప్పటికీ ఫాన్స్ ఉన్నారు. అంతలా ఇంపాక్ట్ చూపించింది తొలిప్రేమ సినిమా. ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ తనకంటూ సొంత ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు. ఇక్కడి నుంచి పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ గా మారాడు. పవన్ కెరీర్ ని అంత టర్న్ చేసిన తొలిప్రేమ సినిమా రిలీజ్ అయ్యి 25 ఏళ్లు అవుతున్న సందర్భంగా, ఈ జూన్ 30న తొలిప్రేమ సినిమాని రీరిలీజ్ చేసారు. ఈ మ్యూజికల్ లవ్ స్టోరీ సినిమా పవన్ ఫాన్స్ తో పాటు యూత్ ని కూడా అట్రాక్ట్ చేస్తుంది. ఒకప్పుడు ఈ క్లాసిక్ లవ్ స్టోరీని థియేటర్స్ లో చూడని ఆడియన్స్, ఇప్పుడు థియేటర్స్ కి వెళ్లి తొలిప్రేమ సినిమాని ఎంజాయ్ చేసే పనిలో ఉన్నారు. తొలిప్రేమ ఆడుతున్న థియేటర్స్ లో ఫాన్స్ హంగామా మాములుగా లేదు, ముఖ్యంగా సంధ్య 70MM థియేటర్ తొలిప్రేమ సినిమా మ్యూజికల్ కాన్సర్ట్ చేస్తున్నట్లు ఎంజాయ్ చేస్తున్నారు.

Exit mobile version