జనసేన పార్టీ అధ్యక్షుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ శనివారం క్రిస్మస్ సందర్భంగా క్రైస్తవులందరికీ తన శుభాకాంక్షలు తెలియజేస్తూ మూడు భాషల్లో ఓ ప్రకటన విడిదల చేశారు. ఆ ప్రకటనపై భారతీయ జనతా పార్టీ నాయకురాలు, నటి మాధవి లత మత మార్పిడికి ఎంకరేజ్మెంట్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.
పవన్ క్రిస్మస్ విషెస్ ఇలా…
క్రిస్మస్ శుభాకాంక్షలు… ‘దైవం మానుష రూపేణా’… మానవునిగా జన్మించి.. మానవులను ప్రేమించి.. మానవులను జాగృతపరచడానికి దివికి ఏతెంచిన దైవపుత్రుడు ఏసుక్రీస్తు. ఆ అవతార పురుషుని జన్మదినం మానవాళికి గొప్ప పర్వదినం. ఏసు నామమును స్మరిస్తూ, ఏసు ప్రభువు పట్ల అచంచల విశ్వాసం కలిగిన ప్రతి ఒక్కరికీ నా తరపున, జనసేన శ్రేణుల తరపున క్రిస్మస్ శుభాకాంక్షలు. సర్వ ప్రాణుల పట్ల కరుణ, ప్రేమ, సేవాభావం చూపాలని క్రీస్తు చేసిన బోధనలు ఎల్లవేళలా ఆచరణీయం. క్షమ, దయ కలిగి ఉండడమే క్రీస్తుపై భక్తికి తార్కాణం. దుర్బుద్ధితో ఉన్నవారికి సద్బుద్ధిని, ఆశ్రిత జనులకు సుఖసంతోషాలను ప్రసాదించమని ఆ కరుణామయుణ్ణి ప్రార్ధిస్తున్నాను అంటూ పవన్ ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు.
మాధవీలత రియాక్షన్ ఏంటంటే?
పవన్ కళ్యాణ్ గారు క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పండి సంతోషం… నమ్మిన వారికి అని చెప్పండి ఇంకా సంతోషం… మానవాళికి లాంటి పెద్ద మాటలు ఎందుకండీ?
మీరే మాత మార్పిడిలకు ప్రోత్సాహం ఇస్తున్నట్టుగా ఉంది…పోస్ట్ విషెస్ పెట్టండి చాలు… బైబిల్ మనం బోధించే అక్కర్లేదు… అక్కడ ఎవరూ దేవుడు లేరు… రెస్పెచ్త్ ఇద్దాం అంతవరకే… మీ శుభాకాంక్షలు తప్ప మీరు రాసిన కంటెంట్ నాకు నచ్చలేదు. సర్వ ప్రాణుల పట్ల అని యేసు చెప్పలేదు. ఆయన అలా చెప్పాడని మొన్నటి వరకూ మీలాగే నేనూ నమ్మాను. కానీ ఆయన ప్రేమ యూదుల వరకు మాత్రమే. మనం యూదులం కాదు అండి.. మీ పేజీ మెయింటెయిన్ చేస్తున్న వారు కొంచెం ఒళ్లు దగ్గర పెట్టుకోవడం మంచిది…
మొన్న మీరు కూడా స్పీచ్ లో బైబిల్ గురించి గొప్పగా చెప్పారు. అంత గొప్ప ఏమి లేదు… ఫ్లోలో చెప్పేసి మీరు కూడా మత మార్పిడికి కారణం కావొద్దు. చాలా బాధగా ఉంది నాకు…మీ పోస్ట్లోవిషెస్ కంటే కన్వర్షన్ కి సపోర్టింగ్ గా ఉంది. హిందువుగా ఉన్నందుకు నేను మీ పోస్ట్ గురించి చాలా ప్యాథెటిక్ గా భావిస్తున్నాను అండి.. అంటూ మాధవీలత అందరికీ షాక్ ఇచ్చింది. పవన్ అంటే ప్రాణం అని చెప్పుకునే మాధవీలత ఇలా రియాక్ట్ అవుతుందని ఎవరు మాత్రం అనుకుంటారు !? ముఖ్యంగా మాధవీలత పోస్ట్ పవన్ అభిమానులకు షాక్. ఇక ఇక్కడితోనే ఆగకుండా ఆమె కొన్ని ప్రశ్నలు అడుగుతూ మరో వీడియోను సైతం పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో కూడా వైరల్ అవుతోంది.
