HHVM : పవన్ కల్యాణ్ నటించిన హరిహర వీరమల్లు థియేటర్లలోకి మరికొన్ని క్షణాల్లో రాబోతోంది. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కీలక విషయాలను పంచుకున్నాడు. ‘నా గురువు సత్యానంద్ వల్లే నేను ఇలా మాట్లాడగలుగుతున్నాను. అంతకు ముందు నేను పెద్దగా మాట్లాడేవాడిని కాదు. కానీ ఆయన వల్లే మాట్లాడటం బాగా నేర్చుకున్నాను. నేను ఇంతకు ముందు చేసిన సినిమాల కంటే ఇది నాకు చాలా స్పెషల్. కోహినూర్ వజ్రం తీసుకురావడం ధ్యేయంగా పోరాడే ధర్మకర్త జీవితమే ఈ మూవీ లైన్. దీన్ని సృష్టించింది డైరెక్టర్ క్రిష్. ఆయన వ్యక్తిగత కారణాల వల్ల ఇందులో నుంచి మధ్యలో తప్పుకున్నారు. కానీ ఆయన వల్లే ఈ మూవీ క్రియేట్ అయింది. ఆయన 30 శాతం షూటింగ్ కంప్లీట్ చేశారు.
Read Also : Chiranjeevi – Anil : హైదరాబాద్ చేరుకున్న చిరు-అనిల్.. జెట్ స్పీడ్ గా షూట్..
ఈ మూవీ మొదలు పెట్టినప్పుడు నేను చాలా టెన్షన్ పడ్డాను. అసలు ఇది వర్కౌట్ అవుతుందా.. ఇది ప్రేక్షకుల ముందుకు వెళ్లగలుగుతుందా అని కొంత భయపడ్డాను. అప్పుడు క్రిష్ ఓ టీజర్ రిలీజ్ చేసి నా భయాన్ని పోగొట్టారు. ఆ టీజర్ నాలో నమ్మకాన్ని పెంచింది. ఆ తర్వాత నేను నిరుత్సాహ పడ్డప్పుడల్లా మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి నాలో ధైర్యాన్ని నింపారు. ఆయన ఏదో ఒక పాట లేదా బీజీఎం క్రియేట్ చేసి నాకు పంపించారు. అది విన్న తర్వాత నాలో నమ్మకం బాగా పెరిగింది. ఆయనకు చాలా స్పెషల్ థాంక్స్. ఆయన లేకుంటే ఈ మూవీని కంప్లీట్ చేసేవాళ్లం కాదేమో అంటూ చెప్పుకొచ్చారు పవన్ కల్యాణ్.
Read Also : HHVM : హరిహర వీరమల్లుకు పవన్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?
