Site icon NTV Telugu

Pawan Kalyan: ఆ ఆశలు నెరవేరకుండానే తుదిశ్వాస విడవటం దురదృష్టకరం

Pawan

Pawan

Pawan Kalyan: నందమూరి తారకరత్న ఇక లేరు. అతిచిన్న వయస్సులోనే ఆయన గుండెపోటుతో మృతిచెందారు. దాదాపు 23 రోజులు మృత్యువుతో పోరాడి తారకరత్న కొద్దిసేపటి క్రితమే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఎన్నో ఆశలతో తారకరత్న మృతి చెందినట్లు తెలుస్తోంది. ఆయన రాజకీయాల్లోకి రావాలని, తాతగారి పార్టీలో తనవంతు కృషి చేయాలనీ కలలు కన్నారు. ఆ కలలు నిజం అవ్వకుండానే మృతి చెందడం విషాదకరం. ఇక తారకరత్న మృతిపట్ల సినీ, రాజకీయ ప్రముఖులు ట్విట్టర్ వేదికగా సంతాపం తెలుపుతున్నారు. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం తారకరత్న ఆశలు నెరవేరకుండా తుదిశ్వాస విడవడం బాధకారమంటూ ట్వీట్ చేశారు. అంతేకాకుండా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు.

NandamuriTarakaRatna: శివరాత్రి రోజునే శివైక్యం చెందిన నందమూరి హీరో

“నటుడు శ్రీ నందమూరి తారకరత్న కన్నుమూయడం బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను. గత మూడు వారాలుగా బెంగళూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీ తారకరత్న కోలుకొంటారని భావించాను. ఆయన నటుడిగా రాణిస్తూనే ప్రజా జీవితంలో ఉండాలనుకొన్నారు. ఆ ఆశలు నెరవేరకుండానే తుదిశ్వాస విడవటం దురదృష్టకరం. శ్రీ తారకరత్న భార్యాబిడ్డలకి, తండ్రి శ్రీ మోహనకృష్ణ గారికి, బాబాయి శ్రీ బాలకృష్ణ గారికి, ఇతర కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను” అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారాయి.

Exit mobile version