NTV Telugu Site icon

Pawan Kalyan: సినిమాలు చేసుకుందాం అంటే.. మీ అభిమానమే నాకు శాపం అయ్యింది..!

Pawan Kalyan About Fanism

Pawan Kalyan About Fanism

Pawan Kalyan Comments on His fans at janasena Meeting: జనసేన సోషల్ మీడియా విభాగంతో సమావేశమైన ఆ పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పలు కీలక విషయాలను ఈ సందర్భంగా వెల్లడించారు. తాను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న అనే విషయాన్ని ప్రకటించిన ఆయన అదే మీటింగ్లో అనేక విషయాలను తన పార్టీ సోషల్ మీడియా వారియర్స్ తో పంచుకున్నారు. ఒక పాపులర్ హీరోగా ఉన్న తాను రాజకీయాల్లోకి రాగానే అధికారం కానీ పవర్ కానీ ట్రాన్స్ఫర్ కాదని ఆయన అన్నారు. ఒక దశాబ్దం పని చేద్దామని నిర్ణయించుకుంటే నాకున్న అభిమాన బలం ఏమి చేస్తుందంటే వాళ్ళు మాట పడరు. మోడీ గారికి నమస్కారం చేసినా నువ్వు మోడీ గారికి నమస్కారం ఎందుకు చేస్తున్నావని అంటారు. ఆయన మహానాయకుడురా ఆయనకు నమస్కారం చేస్తే ఏమవుతుందని నేను అంటానని అన్నారు. ఒకోసారి అభిమానం ఎదగనివ్వదని, అభిమానం ఏమంటుంది నిన్ను వైసీపీ నాయకులు తిడుతుంటే మేము చచ్చిపోతున్నాం ఎందుకు వచ్చారు రాజకీయాల్లోకి అని అంటుంది.

Pawan Kalyan: నేను ఓడిపోతాను అని నాకు తెలుసు.. నా కోసం ఆలోచించేది ఆ ఒక్కడే

కానీ నేను మీ కోసం రాలేదు, ఏడుస్తున్న సుగాలి ప్రీతి తల్లి కోసం వచ్చాను, నా నేల ఇది, నా దేశం ఇది, నా సమాజం ఇది అని అన్నారు. నేను రాజకీయాలలోకి రాకుండా సినిమాలు చేస్తున్నా నన్ను వదలలేదు. శుభ్రంగా సినిమాలు చేసుకుందాం అంటే ‘అత్తారింటికి దారేది’ని పనిగట్టుకొని ఇంటర్నెట్‌లో రిలీజ్ చేశారని పవన్ అన్నారు. నన్ను బ్రతకనివ్వరు అన్నాను, నా ఎదుగుదలే నా శాపం అయింది. మీ గుండెల్లో నామీద ఉన్న అభిమానమే శాపం అయింది అంటూ పవన్ పేర్కొన్నారు. ఎంతకాడికి రాజకీయం చేద్దాంలే అని రాజకీయంలోకి వచ్చాను. నా వ్యూహం అమలు చేసి ఉంటే ఈ పాటికి రికగ్నైజ్డ్ పార్టీ అయి ఉండేది, కానీ దాన్ని అమలు చేయనివ్వలేదని ఆయన అన్నారు.