NTV Telugu Site icon

Pawan Kalyan: ‘బ్రో’ ట్రైలర్ టాక్… మనల్ని ఎవడ్రా ఆపేది

Bro

Bro

నిన్న మొన్నటి వరకు బ్రో ప్రమోషన్స్ కాస్త స్లోగా సాగాయి. కానీ ఈ రోజు నుంచి బ్రో హైప్ నెక్స్ట్ లెవల్‌కి వెళ్లనుంది. బ్రో ట్రైలర్‌ను ఈ రోజు సాయంత్రం 6 గంటల 3 నిమిషాలకు రిలీజ్ చేయబోతున్నారు. వైజాగ్ ‘జగదాంబ’, హైదరాబాద్‌ ‘దేవి’ థియేటర్లలో ఒకేసారి గ్రాండ్‌గా లాంచ్ చేయనున్నారు. ఇక్కడి నుంచి బ్రో సినిమాకు మరింత హైప్ రానుంది. ఎందుకంటే.. ఇప్పటి వరకు బ్రో మూవీ నుంచి రెండు పాటలు, ఓ టీజర్ మాత్రమే బయటికొచ్చాయి. ఒక్కసారి ట్రైలర్ రిలీజ్ అయితే.. పవర్ స్టార్ దెబ్బకు సోషల్ మీడియా షేక్ అయిపోవడం గ్యారెంటీ. అందుకే బ్రో ట్రైలర్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు పవర్ స్టార్ ఫ్యాన్స్. ఇక ట్రైలర్ ఓ రేంజ్‌లో కట్ చేసినట్టు తెలుస్తోంది. పవర్ స్టార్ ఫ్యాన్స్‌కి నెక్స్ట్ లెవెల్ ట్రీట్ ఇచ్చేలా ఉంటుందని సమాచారం.

పవన్ స్వాగ్, స్టైల్ అదిరిపోయిందట. ముఖ్యంగా పవన్ తనని తానే ఇమిటేట్ చేసే విధంగా ఈ ట్రైలర్ ఉంటుందని అంటున్నారు. మొత్తంగా మెగా ఫ్యాన్స్ అంచనాలకు ఏ మాత్రం తక్కువ కాకుండా.. ఫుల్ మీల్స్ పెట్టేలా ట్రైలర్ కట్ ఉందని అంటున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన పవర్ స్టార్ పోస్టర్స్‌లో వింటేజ్ పవన్‌ను చూసి ఫుల్ ఖుషీ అయ్యారు మెగా ఫ్యాన్స్. ఇక ఇప్పుడు ట్రైలర్‌ అంతకుమించి అనేలా హై ఇచ్చేలా ఉంటుందని తెలుస్తోంది. ఇక సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినమాను.. ప్రముఖ నటుడు, దర్శకుడు సముద్ర ఖని దర్శకత్వం వహించారు. కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్లు హీరోయిన్లుగా నటిస్తుండగా.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మించారు. జూలై 28న బ్రో మూవీ థియేటర్లలోకి రానుంది.