Site icon NTV Telugu

Pawan Kalyan: వింటేజ్ పవన్.. నాలుగు గెటప్ లతో ‘బ్రో’ ఆగమనం..?

Pawan

Pawan

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకపక్క సినిమాలతో, ఒకపక్క రాజకీయ ప్రచారాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న చిత్రాల్లో బ్రో ఒకటి. సముతిరఖని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ మాటలు అందించాడు.పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ చిత్రంలో పవన్ తో పాటు మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కూడా హీరోగా కనిపిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా జూలై లో రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రమోషన్స్ జోరును పెంచేశారు. గత కొన్నిరోజులుగా ఈ సినిమా టీజర్ ఈ నెల 28 న కానీ, 29 న కానీ రిలీజ్ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బ్రో టీజర్ కోసం అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. అందుకు కారణం బ్రో సినిమాలో పవన్ వింటేజ్ లుక్ లో కనిపించనున్నాడట. ఇక ఈ సినిమాలో పవన్ దేవుడుగా కనిపిస్తున్న విషయం తెల్సిందే.

Surekha Vani: డ్రగ్స్ కేసు.. దయచేసి నన్ను.. నా కుటుంబాన్ని నాశనం చేయకండి

ఇక అందుతున్న సమాచారం ప్రకారం ఈ టీజర్ లోనే పవన్ నాలుగు గెటప్స్ లో కనిపించనున్నాడట. ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ బాగా ఎనర్జిటిక్ గా కనిపించిన సినిమా ఇదే అంటున్నారు. దీంతో టీజర్ పైన అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వింటేజ్ పవన్ కనిపిస్తున్నాడు అంటేనే అభిమానులు ఆగడం లేదు. ఇక నాలుగు గెటప్ ల్లో అంటే అసలు ఫ్యాన్స్ కు పూనకాలు ఖాయమని అంటున్నారు. మరి ఇందులో ఎలాంటి నిజముందో చూడాలి. త్వరలోనే మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తారేమో చూడాలి.

Exit mobile version