Pawan kalyan apologies to prabahs fans: వారాహి యాత్రలో జనసేనాని పవన్ కళ్యాణ్ సినిమా హీరోల అభిమానుల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ వారాహి యాత్రలో కొత్తగా వివిధ హీరోల అభిమానులను ఆకట్టుకునేందుకు ఆ నటుల గురించి ప్రస్తావించడం ప్రారంభించారు. ముందు జూనియర్ ఎన్టీఆర్ ఆ తరివాత ప్రభాస్ గురించి కామెంట్స్ చేయగా ఇప్పుడు ఏకంగా ప్రభాస్ అబిమానులకు సారీ చెప్పారు పవన్. భీమవరంలో ఆయన మాట్లాడుతూ నేను ఏరోజు ఫ్యాన్ క్లబ్ పెట్టలేదు, కేవలం జనసేన అని పెట్టాను, ప్రజలందరూ కావాలి, నన్ను అభిమానించే, అభిమానించని యువత అందరూ నాకు కావాలి, మీరు ఆంధ్రప్రదేశ్ యువత అందరి అభిమానుల కోసం నేను ఉన్నాను ఒక్క నా అభిమానుల కోసం కాదు అని అన్నారు. ఇక్కడ ప్రభాస్ గారి అభిమానులు ఎక్కువ, మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, చిరంజీవి అభిమానులు ఎక్కువ, వారందరి అభివృద్ది కోసం జనసేన ఉందని ఆయన అన్నారు.
Rangabali Censor: రంగబలి సెన్సార్ పూర్తి.. ఏం సర్టిఫికేట్ ఇచ్చారంటే?
గతంతో పోలిస్తే మా వాళ్ళు బైక్ సైలెన్సర్లు తీసేసి తిరగడం తగ్గింది, వైసీపీ నాయకుల నోట్లో సైలేన్సర్లు తగ్గిస్తే మా వాళ్ళు పూర్తిగా తగ్గిస్తారని అన్నారు. ఇక గతంలో ఒకసారి ప్రభాస్ గారి అభిమానులకు నా అభిమానులకు చిన్న పోస్టర్ విషయంలో గొడవ జరిగింది, ఒక పోస్టర్ చినిగితే అంత గొడవ చేయకూడదు, క్షమించి వదిలివేయాలి, చిన్న గొడవను పెద్దది చేయవద్దు అని చేతులెత్తి వేడుకుంటున్నాను అని పవన్ అన్నారు. నిజానికి గతంలో జనసేనకు మద్దతివ్వాల్సిందిగా ప్రభాస్ అభిమానుల్ని కోరారు. ఆ సభలో జనసేనకు మద్దతు తెలిపిన ప్రభాస్ అభిమానులకు ధన్యవాదాలంటూ ప్రసంగం ప్రారంభించారు పవన్ కళ్యాణ్. అంతేకాకుండా ప్రభాస్ నిజాయితీగా సంపాదిస్తే..వైఎస్ జగన్ అవినీతితో సంపాదించాడని తీవ్ర ఆరోపణలు చేశారు.
గతంలో ఒకసారి ప్రభాస్ గారి అభిమానులకు నా అభిమానులకు చిన్న పోస్టర్ విషయంలో గొడవ జరిగింది, ఒక పోస్టర్ చినిగితే అంత గొడవ చేయకూడదు, క్షమించి వదిలివేయాలి, చిన్న గొడవను పెద్దది చేయవద్దు అని చేతులెత్తి వేడుకుంటున్నాను – భీమవరంలో @JanaSenaParty అధినేత శ్రీ @PawanKalyan గారు.…
— JanaSena Shatagni (@JSPShatagniTeam) June 30, 2023