పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ అనేక ప్రాజెక్ట్‌లను లైన్‌లో పెట్టారన్న విషయం తెలిసిందే. రాజకీయాల్లో బిజీగా మారకముందే వాటిని పూర్తి చేయాలని ఆయన భావిస్తున్నారు. నిర్మాత రామ్ తాళ్లూరితో పవన్ ఓ ప్రాజెక్ట్ చేయనున్నారన్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ‘ఏజెంట్’ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించబోతున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం పవన్ ఈ ప్రాజెక్ట్ ను పక్కన పెట్టినట్టు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన లేనప్పటికీ పవన్ తో సురేందర్ రెడ్డి ప్రాజెక్ట్ ఆగిపోయింది అంటూ రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి.
Read Also : Kartik Aaryan : హీరోతో పెళ్లి… కోట్లు కుమ్మరించడానికి సిద్ధమైన ఫ్యాన్ !
సురేందర్ రెడ్డి చెప్పిన స్క్రిప్ట్ పవన్ ను అంతగా ఆకట్టుకోలేదని తాజా సమాచారం. అందుకే రామ్ తాళ్లూరి మరో దర్శకుడి వేటలో ఉన్నారట. ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతానికి హోల్డ్‌లో ఉందని అంటున్నారు. సరైన దర్శకుడు, స్క్రిప్ట్ తో వస్తే రామ్ తాళ్లూరి కోసం డేట్స్ కేటాయించేందుకు పవన్ రెడీ అవుతున్నాడు. ‘భీమ్లా నాయక్’ తర్వాత పవన్ ‘వినోదయ సీతం’ రీమేక్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మూవీ షూటింగ్ ఏప్రిల్‌లో ప్రారంభమవుతుంది. ఇక ఇప్పుడు ఆయన క్రిష్ “హరి హర వీర మల్లు” షూటింగ్ ను కూడా తిరిగి ప్రారంభించనున్నాడు. త్వరలో షూటింగ్ పార్ట్‌లు పూర్తవుతాయి. పవన్ ఖాతాలో ఇంకా హరీష్ శంకర్, సుజీత్ ల సినిమాలు ఉన్నాయి. ఈ రెండు ప్రాజెక్టులు వచ్చే ఏడాది ప్రారంభం కానున్నాయి.
