Site icon NTV Telugu

Pawan Kalyan: మావయ్యకే మంచిచెడు చెప్తున్నావా.. సాయి బాబు

Kalyan

Kalyan

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో మల్టీస్టారర్ చేయడానికి మెగా ఫ్యామిలీ అంతా ఎంతగానో ఎదురుచూస్తుంది అన్న విషయం తెల్సిందే. అప్పుడప్పుడు చిరు సినిమాల్లో పవన్ గెస్ట్ గా కనిపించాడే కానీ వీరిద్దరూ కూడా పూర్తిస్థాయిలో సినిమా తీయలేదు. అయితే ఆ అవకాశాన్ని పట్టేశాడు మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్. చిన్నతనం నుంచి పవన్ తో తేజ్ కు ఉన్న అనుబంధం వేరు. తేజ్ కు గురువు అయినా, మామ అయినా పవనే. ఈ విషయాన్ని తేజ్ ఎన్నోసార్లు చెప్పుకొచ్చాడు. ఇక ఆయనతో కలిసి నటించడం అంటే అదృష్టమే అని చెప్పుకొచ్చాడు. తమిళ్ దర్శకుడు సముతిర ఖని దర్శకత్వంలో పవన్- తేజ్ కలిసి నటిస్తున్న ఈ చిత్ర నేడు పూజా కార్యక్రమాలతో మొదలయిన విషయం తెల్సిందే. తమిళ్ లో మంచి హిట్ అందుకున్న వినోదాయ సీతాం సినిమాకు ఈ చిత్రం అధికారిక రీమేక్. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్.. స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నాడు.

Allari Naresh: అన్నా.. మరీ నువ్వలా భయపెట్టకే.. ‘నేను’ సినిమా గుర్తొస్తుంది

ఇక ఈరోజు జరిగిన పూజా ఈవెంట్ లో మా అల్లుళ్ళు చేసిన సందడి అంతా ఇంత కాదు. ఇద్దరికీద్దరు బ్లాక్ హూడీలు వేసుకొని అల్ట్రా స్టైలిష్ లుక్ లో కనిపించి అభిమానులకు పిచ్చెక్కించారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ముఖ్యంగా తేజ్ చైర్ లో కూర్చొని.. పవన్ నిలబడి దేని గురించో చర్చిస్తున్నట్లు ఉన్న ఫోటో అయితే అల్టిమేట్ అని చెప్పాలి. ఈ ఫొటోపై అభిమానులు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. ఇక తాజాగా స్క్రీన్ ప్లే రైటర్ బీవీఎస్ రవి సైతం తనదైన శైలిలో ఈ ఫోటోను షేర్ చేస్తూ మంచి క్యాప్షన్ ఇచ్చాడు. “మావయ్య ముందు కూర్చుని ఆయనకే మంచి చెడు చెప్తున్నావు.. బాగుందయ్యా సాయి బాబు” అంటూ నవ్వుతున్న ఎమోజిలను షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ సినిమాతో మామ అల్లుళ్లు ఎలాంటి హిట్ ను అందుకుంటారో చూడాలి.

Exit mobile version