Site icon NTV Telugu

Acharya : రంగంలోకి పవర్ స్టార్ ?

Acharya

Acharya

“ఆచార్య” మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ పైనే ఇప్పుడు అందరి దృష్టి పడింది. ఈవెంట్ ఎప్పుడు ? ఎక్కడ ? ఎలా ? అతిథులు ఎవరు ? అన్న విషయంపై సోషల్ మీడియాలో ఆసక్తికర టాక్ నడుస్తోంది. తాజాగా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చిరంజీవి సోదరుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారనే బజ్ హాట్ టాపిక్ గా మారింది. అంతేకాకుండా ఏప్రిల్ 23న హైదరాబాద్‌లో జరగనున్న ఈ కార్యక్రమానికి టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రాజమౌళి కూడా హాజరు కానున్నారని అంటున్నారు. అయితే ఈ విషయంపై ఇంకా మేకర్స్ నుండి అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. ఈ వార్తలు గనుక నిజమైతే మెగా హీరోలను ఒకే వేదికపై చూడటం అభిమానులకు ఐ ఫీస్ట్ గా ఉంటుంది.

Read Also : Director Tatineni Rama Rao Passes Away : టాలీవుడ్ లో మరో విషాదం

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు మెగా పవర్‌ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన “ఆచార్య” ఏప్రిల్ 29న థియేటర్‌లలో గ్రాండ్ గా విడుదల కానుంది. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే కథానాయికలుగా నటించారు. కాగా ఇటీవ‌ల విడుద‌లైన ‘ఆచార్య’ ట్రైల‌ర్ కు మంది ఆద‌ర‌ణ‌ లభించింది. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న “ఆచార్య”కు మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించారు. ఈ మెగా యాక్షన్ డ్రాను థియేటర్లలో చూడడానికి ప్రేక్షకులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

Exit mobile version