Site icon NTV Telugu

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ మాస్టర్ ప్లాన్: తక్కువ రోజులు.. భారీ ప్రాజెక్ట్!

Pawan Kalyan

Pawan Kalyan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన అభిమానులకు మరో క్రేజీ అప్‌డేట్‌తో ఊపునిచ్చారు, ఇప్పటికే ‘ఓజీ’తో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఆయన, ఇప్పుడు తన తదుపరి భారీ ప్రాజెక్ట్ కోసం అధికారికంగా కాల్ షీట్లు కేటాయించారు. స్టైలిష్ ఫిల్మ్ మేకర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రంపై సినీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి, తాజా సమాచారం ప్రకారం, పవన్ కళ్యాణ్ మార్చి నెల నుండి ఈ చిత్ర షూటింగ్‌లో పాల్గొనబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన డేట్స్ ఫైనలైజ్ చేసే పనిలో చిత్ర యూనిట్ నిమగ్నమై ఉంది, ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో రాజకీయ బాధ్యతలు నిర్వహిస్తూనే, పవన్ ఈ సినిమా కోసం సమయాన్ని కేటాయించడం విశేషం.

Also Read:Ravi Teja Horror Movie: రవితేజ సినిమాలో విలన్‌గా స్టార్ డైరెక్టర్.. థియేటర్లలో బ్లాస్ట్ పక్కా!

ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ ఒక స్పష్టమైన నిబంధన విధించినట్లు తెలుస్తోంది, సుదీర్ఘమైన కాల్ షీట్లు కాకుండా, ‘ఓజీ’ (OG) సినిమాను ఎలాగైతే తక్కువ సమయంలో పూర్తి చేశారో, అదే తరహాలో ఈ ప్రాజెక్ట్‌ను కూడా ఒక షార్ట్ షెడ్యూల్‌లో పూర్తి చేయాలని పవన్ కోరారు. దీనివల్ల ఆయన రాజకీయ ప్రయాణానికి ఎలాంటి ఆటంకం కలగకుండా షూటింగ్ సాఫీగా సాగిపోనుంది, వక్కంతం వంశీ కథను అందిస్తున్న ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. పవన్ అత్యంత ఆప్తమిత్రుడు రామ్ తాళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గతంలోనే ప్రకటించబడిన ఈ ప్రాజెక్ట్ కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. అయితే, 2026 న్యూ ఇయర్ సందర్భంగా వచ్చిన అఫిషియల్ అనౌన్స్‌మెంట్‌తో మెగా అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు, సమ్మర్‌లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సందడి చేస్తుండగానే, సురేందర్ రెడ్డి సినిమా షూటింగ్ పట్టాలెక్కడం విశేషం.

Exit mobile version