డైరెక్టర్ హరీష్ శంకర్.. పవన్ కళ్యాణ్‌కు గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ ఇవ్వడంతో.. ‘భవదీయుడు భగత్ సింగ్’ కోసం.. ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు మెగాభిమానులు. అయితే ఎప్పుడో అనౌన్స్ అయిన ఈ సినిమా సెట్స్ పైకి మాత్రం వెళ్లడం లేదు. దాంతో హరీష్ శంకర్ మరో ప్రాజెక్ట్ కమిట్ అయ్యాడని.. పవన్ ఈ సినిమాని చెయ్యడం లేదని.. మొత్తంగా ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందనే రూమర్స్ వచ్చాయి. కానీ రీసెంట్‌గా.. నాని హీరోగా నటించిన ‘అంటే సుందరానికి’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో.. స్వయంగా పవనే.. త్వరలోనే హరిష్ శంకర్‌తో సినిమా స్టార్ట్ అవుతుందని క్లారిటీ ఇచ్చారు. దాంతో మైత్రి మూవీ మేకర్స్‌తో పాటు హరీష్ శంకర్ కూడా ఈ ప్రాజెక్ట్ పై వస్తున్న పుకార్లకు చెక్ పెట్టారని చెప్పొచ్చు. ప్రస్తుతం పవన్ హరి హర వీరమల్లు సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ మూవీ అయిపోయిన తర్వాత భవదీయుడు భగత్ సింగ్ స్టార్ట్ చేయబోతున్నారు.
ఇదిలా ఉంటే.. ఈ మూవీలో సల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్ చేయబోతున్నారనే వార్త.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ మధ్య హరీష్ శంకర్ ఒకటి, రెండుసార్లు సల్మాన్ ఖాన్‌ను కలిసాడు. ఆయనతో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. సల్మాన్ ఖాన్‌తో ఏదైనా ప్రాజెక్ట్ చేయబోతున్నాడా.. అనే సందేహాలు వెలువడ్డాయి. కానీ ఇప్పుడు.. అసలు విషయం ఇదేనంటూ ప్రచారం జరుగుతోంది. భవదీయుడు భగత్ సింగ్ మూవీలో గెస్ట్ రోల్ కోసం.. సల్మాన్ ఖాన్‌ను సంప్రదించాడట హరీష్ శంకర్. సల్లూభాయ్ కూడా అందుకు ఒకే చెప్పాడని తెలుస్తోంది. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ చిత్రంలో గెస్ట్ రోల్ చేస్తున్నాడు సల్మాన్. ఇక ఇప్పుడు పవర్ స్టార్ సినిమాలో కూడా నటించబోతున్నాడని తెలియడంతో.. ఈ క్రేజీ కాంబో ఇంట్రెస్టింగ్‌గా మారింది. అంతేకాదు బ్లాక్ బస్టర్‌గా నిలిచిన గబ్బర్ సింగ్.. సల్మాన్ హిట్ మూవీ దబంగ్ రీమేక్‌గా తెరకెక్కింది. దాంతో పవన్-సల్మాన్ నిజంగానే స్క్రీన్ షేర్ చేసుకుంటే అదిరిపోతుందని చెప్పొచ్చు. ప్రస్తుతం సల్మాన్ హైదరాబాద్‌లోనే ఉన్నారు. ‘కభీ ఈద్ కభీ దీపావళి’ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రంలో వెంకటేష్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఏదేమైనా ఇప్పుడు సల్మాన్ ఖాన్ ఫోకస్ టాలీవుడ్ పై పడిందని చెప్పొచ్చు.
