Site icon NTV Telugu

Pathaan: ‘షంషేరా’ పరాజయాన్ని మర్చిపోవడానికేనా…

Patan

Patan

Pathaan:  To forget Shamshera’s Failures…

ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిలిమ్స్ నిర్మించిన ‘షంషేరా’ చిత్రం ఇటీవల విడుదలై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. రణబీర్ కపూర్ అభిమానులు సైతం ఈ సినిమా చూసి, తలలు పట్టుకున్నారు. విజయాలు వస్తే పొంగిపోవడం, పరాజయాల సమయంలో కృంగిపోవడం ఎవరికైనా సహజం. కానీ యశ్ రాజ్ ఫిలిమ్స్ లాంటి సంస్థలకు సక్సెస్, ఫ్లాప్ అనేది ఇవాళ కొత్త కాదు. అందుకే ఆ చేదు సంఘటనలను మర్చిపోయి… మూవ్ ఆన్ అయ్యే ప్రయత్నం చేస్తోంది. ప్రస్తుతం ఆ సంస్థ షారుక్ ఖాన్ తో ‘పఠాన్’ మూవీని భారీ స్థాయిలో నిర్మిస్తోంది. ఇటీవలే ఈ మూవీ పోస్టర్ ను విడుదల చేసింది. అలానే వచ్చే యేడాది జనవరి 25న రిపబ్లిక్ డే కానుకగా ‘పఠాన్’ ను హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లోనూ డబ్ చేసి రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించింది. ఇక ఈ మూవీ రిలీజ్ కరెక్ట్ గా ఆరు నెలలు ఉన్న సందర్భంగా ఇవాళ ఇందులోని దీపికా పదుకునేకు సంబంధించిన మోషన్ పోస్టర్ ను, ఫస్ట్ లుక్ ను యశ్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ విడుదల చేసింది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ఆదిత్య చోప్రా ‘పఠాన్’ మూవీని నిర్మిస్తున్నారు.

Exit mobile version