Patang: జీ సింగర్ హీరోగా.. ఇన్‌స్టాగ్రామ్ భామ హీరోయిన్ గా పతంగ్.. రిలీజ్ ఎప్పుడంటే?
- జీ సింగర్ హీరోగా ఇన్‌స్టాగ్రామ్ భామ హీరోయిన్ గా పతంగ్
- నటుడు ఎస్‌పీ చరణ్ కీలకమైన పాత్రలో పతంగ్
- డిసెంబరు 27న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Patang Movie to Release on December 27th: జీ సింగర్ హీరోగా.. ఇన్‌స్టాగ్రామ్ భామ హీరోయిన్ గా పతంగ్ అనే సినిమా తెరకెక్కింది. ఇప్పటి వరకు ఎన్నో స్పోర్ట్స్ డ్రామాలు చూసి ఉంటారు కానీ పతంగుల పోటీతో రాబోతున్న కామెడీ స్పోర్ట్స్ డ్రామా మా సినిమానే అంటున్నారు ‘పతంగ్’ మేకర్స్. సినిమాటిక్ ఎలిమెంట్స్ అండ్ రిషన్ సినిమాస్ పతాకంపై విజయ్ శేఖర్ అన్నే, సంపత్ మక, సురేష్ కొత్తింటి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు ప్రణీత్ ప్రత్తిపాటి దర్శకుడుగా వ్యవహరిస్తున్నారు. నాని బండ్రెడ్డి క్రియేటివ్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో ఇన్‌స్టాగ్రామ్ సెన్సేషన్ ప్రీతి పగడాల, జీ సరిగమప రన్నరప్ ప్రణవ్ కౌశిక్‌తో పాటు వంశీ పూజిత్ ముఖ్యపాత్రాలు పోషిస్తున్నారు. మరికొంత మంది నూతన నటీనటులతో పాటు ప్రముఖ సింగర్, నటుడు ఎస్‌పీ చరణ్ ఈ సినిమాలో కీలకమైన పాత్రలో కనిపించబోతున్నారు.
Rashmika Mandanna: రష్మిక మందన్నకు బరువైన బాధ్యతలు
Also Read
ఇప్పటికే షూట్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కూడా పూర్తిచేసుకున్న ఈ సినిమా డిసెంబరు 27న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం నుంచి ఇటీవల విడుదల చేసిన పాటలతో పాటు టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ చిత్రం విడుదల తేదిని ప్రకటించారు మేకర్స్. డిసెంబరు 27న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నామని వెల్లడించారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ ‘ఈ సినిమా థియేటర్‌లో యూత్‌ఫెస్టివల్‌లా ఉంటుంది. కొత్తవాళ్లతో చేసిన మా సినిమా కొత్తగా వుండటంతో పాటు చాలా పెద్ద సినిమా క్వాలిటీతో ఉంటుందన్నారు. ఈ సినిమాకు కథే హీరో అని, మా పతంగ్ అన్నివర్గాల వారిని అలరిస్తుందనే నమ్మకం ఉందని పేర్కొన్నారు. కొత్త కంటెంట్‌ను ఆదరించే తెలుగు ప్రేక్షకులు మా ప్రయత్నాన్ని తప్పకుండా ఆదరిస్తారనే నమ్మకం ఉందని వెల్లడించారు.
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!