Parvathy Thiruvothu: ప్రస్తుతం చిత్ర పరిశ్రమను ఏలుతున్న హీరోయిన్స్ లో ఎక్కువ మలయాళ, కన్నడ హీరోయిన్ ఎక్కువ అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇక ఆ మలయాళ హీరోయిన్స్ లో పార్వతి తిరువోతు ఒకరు. ఆమె గురించి తెలుగు ప్రేక్షకులకు కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చార్లీ, బెంగుళూరు డేస్, మరియన్, ఉయిరే లాంటి సినిమాలతో ఎంతో గుర్తింపు తెచ్చుకుంది. ఇక నాలుగురోజుల క్రితం రిలీజ్ అయిన దూత సిరీస్ లో ఆమె ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా కనిపించి మెప్పించింది. ముఖ్యంగా నాగ చైతన్య ను ఇంటరాగేషన్ చేసే ఆఫీసర్ గా ఆమె నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. పంకజ్ త్రిపాఠి ప్రధాన పాత్రలో నేషనల్ అవార్డ్ విన్నర్ అనిరుద్ రాయ్ చౌదరి దర్శకత్వం వహించిన చిత్రం కడక్ సింగ్. ఓపస్ కమ్యూనికేషన్స్, విజ్ ఫిల్మ్స్, కె.వి.ఎన్.ప్రొడక్షన్ బ్యానర్స్‌పై ఆండ్రే తిమ్మిన్స్, విరాఫ్ సర్కారి, సబ్బాస్ జోసెఫ్, హెచ్ కంటెంట్ స్టూడియో మహేష్ రామనాథన్, కె.వి.ఎన్ ఈ చిత్రాన్నినిర్మించగా శ్యామ్ సుందర్, ఇంద్రాణి ముఖర్జీ సహ నిర్మాతలుగా వ్యవహరించారు.
Suresh Kondeti: అవార్డ్స్ కోసం పిలిచి అవమానిస్తావా.. ఏకిపారేస్తున్న నెటిజన్స్
ఇక ఈ చిత్రంలో పార్వతి తిరువోతు కీలక పాత్రలో నటిస్తుండగా.. సంజన సంఘి, బంగ్లాదేశ్ నటి జయా ఎహసాన్, దిలీప్ శంకర్, పరేష్ పాహుజా, వరుణ్ బుద్ధదేవ్ నటించారు. ఇక ఈ సినిమా డిసెంబర్ 8న ZEE5లో ప్రీమియర్ కానుంది. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన చిత్ర బృందం వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాపై హైప్ పెంచుతున్నారు. ఈ నేపథ్యంలోనే పార్వతి తిరువోతు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “కడక్ సింగ్’లో నటించటం అరుదుగా దొరికే అవకాశం. టోని డా సృష్టించిన పాత్ర ఇది. అందులోనూ పంకజ్ వంటి యాక్టర్‌తో కలిసి నటించటం మెమొరబుల్ ఎక్స్‌పీరియెన్స్. అలాగే సంజన సంఘి, పరేష్ పాహుజ, జయా ఎహసాన్ ఇలా అందరూ అద్భుతమైన నటనను ప్రదర్శించారు. మనం సినిమాల రూపంలో చూపించే కథల్లో విషయ సంగ్రహణతో పాటు మానవత్వాన్ని మేల్కొపేలా ఉండాలి. అలాంటి ఓ అనుభూతిని టోనీ డా అండ్ టీమ్ ‘కడక్ సింగ్’లో మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు” అని చెప్పుకొచ్చింది. మరి ఈ సినిమాతో ఆమె ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.