Paruchuri Venkateswara Rao: టాలీవుడ్ లో పరుచూరి బ్రదర్స్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పరుచూరి గోపాలకృష్ణ, పరుచూరి వెంకటేశ్వరరావు అంటే ఇండస్ట్రీలో ఒక బ్రాండ్.. మాస్ కథలకు కేరాఫ్ అడ్రెస్స్. వారు రాసిన కథలు ఎన్నో టాలీవుడ్ లో ఇండస్ట్రీ హిట్లుగా నిలిచిపోయాయి. ఇక పరుచూరి వెంకటేశ్వరరావు కథా రచయిత గానే కాకుండా నటుడిగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించారు. అయితే గత కొంత కాలంగా ఆయన ఆరోగ్యం బాగోలేదని వార్తలు వినిపిస్తున్న విషయం విదితమే. ఇక ఈ మధ్యనే డైరెక్టర్ జయంత్ సి పర్జానీ, పరుచూరి ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేయగా అదికాస్తా వైరల్ గా మరి అదేంటి పరుచూరి ఇలా అయిపోయారు ఏంటి అనుకున్నారు.
ఇక ఈ ఫోటోపై గోపాలకృష్ణ క్లారిటీ కూడా ఇచ్చారు. అన్నకు ఏమి కాలేదని, ఆయన ఇటీవలే విదేశాలు వెళ్లిరావడంతో అలా మారారని చెప్పారు. ఇక దీంతో ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకున్నారు. ఇక ఇటీవల కృష్ణ అంత్యక్రియల్లో పరుచూరి కనిపించడం హాట్ టాపిక్ గా మారింది. అస్సలు గుర్తుపట్టలేని స్థితిలో పరుచూరి వెంకటేశ్వరరావు ఉన్నారు. వయస్సు మీదపడి, శరీరం మొత్తం వంగిపోయి, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నట్లు కనిపించారు. సడెన్ గా చూస్తే ఆయన పరుచూరి వెంకటేశ్వరరావునా అని అనిపించక మానదు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ ఫోటో చుసిన అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.