మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ నటి సంయుక్త మీనన్ జంటగా డైరెక్టర్ కార్తీక్ దండు దర్శకత్వం లో వచ్చిన సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం విరూపాక్ష.ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా వంద కోట్ల కలెక్షన్లను తెచ్చి పెట్టింది.. ఇలా ఈ సినిమా మంచి విజయం సాధించింది.. అయితే ఈ సినిమా గురించి తాజాగా ప్రముఖ రచయిత అయిన పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ ఈ సినిమాపై తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు. విరూపాక్ష సినిమా కోసం రచయిత ప్రభాకర్ అందించిన డైలాగ్స్ ఎంతో అద్భుతం గా ఉన్నాయనీ పరుచూరి వెల్లడించారు.
ఈ సినిమా లో ప్రతి ఒక్క డైలాగ్ ను ప్రభాకర్ ఎంతో శ్రద్ధ గా రాసారని పరుచూరి తెలిపారు. ఒక చిన్న పల్లెటూరిలో జరిగే కథ ను చాలా అద్భుతంగా తెరకెక్కించారని పరుచూరి ప్రశంసలు కురిపించారు. ప్రస్తుత కాలంలో ఒక సినిమా రెండు మూడు వారాలు థియేటర్లో ప్రసారం అవ్వడం అంటే కష్టం అలాంటిది ఈ సినిమా ఏకంగా 100 కోట్లు రాబట్టింది అంటే ఈ సినిమా ఎంత అద్భుతం గా ఉందో చెప్పొచ్చు.ఈ సినిమా లో ప్రేమించిన అమ్మాయి కోసం హీరో ఊరి సమస్యను పరిష్కరించిన తీరును చూపించడం కూడా ఎంతో బాగుందని పరుచూరి తెలియచేశారు. రెండున్నర గంటల పాటు ప్రేక్షకులకు సస్పెన్స్ అందించడం మాములు విషయం కాదు.. ఈ విషయంపై దర్శకుడుని ప్రశంసించాలి .ఈ సినిమాలో తాంత్రిక పూజలు,భయపెట్టే సన్నివేశాలు కూడా ఉన్నాయి వాటిని కూడా దర్శకుడు అద్భుతం గా చూపించాడు.. ఇలా ఈ సినిమా ఇంతటి భారీ విజయం సాధించడాని కి ప్రధాన కారణం కూడా కథ, స్క్రీన్ ప్లే అని పరుచూరి తెలిపారు. ఇక ఈ సినిమాలో హీరో సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్ మరియు కార్తీక్ దండు,అజయ్ ఈ నలుగురికి మంచి మార్కులు వేయవచ్చని పరుచూరి తెలిపారు.
