Pareshan Trailer: మంచి సినిమా ఎక్కడ ఉన్నా.. దాన్ని తెలుగు ప్రేక్షకులకు అందివ్వడం సురేష్ ప్రొడక్షన్స్ కు ఉన్న గొప్ప అలవాటు. చిన్న సినిమాలను వెతికి, కనిపెట్టి.. వాటికి సపోర్ట్ గా నిలవడంతో రానా దగ్గుబాటికి సాటి మరెవ్వరు లేరు. కేరాఫ్ కంచెరపాలెం సినిమానే అందుకు ఉదాహరణ. ఇక అలాంటి గ్రామీణ నేపథ్యంలో వస్తున్న మరో సినిమాను రానా పట్టేశాడు. ఆ సినిమానే పరేషాన్. మసూద సినిమాతో ప్రేక్షకులను అలరించిన తిరువీర్ హీరోగా ఈ సినిమా తెరకెక్కింది. రూపక్ రోనాల్డ్ సన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను వాల్తేరు ప్రొడక్షన్స్ బ్యానర్ పై సిద్దార్థ్ రాళ్లపల్లి నిర్మిస్తుండగా.. రానా దగ్గుబాటి ప్రెజెంట్ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.
Music Director Raj: బిగ్ బ్రేకింగ్.. రాజ్- కోటి ద్వయంలో రాజ్ ఇకలేరు
ట్రైలర్ ఆద్యంతం నవ్వులు పూయిస్తుంది. ప్రతి కాలేజ్ స్టూడెంట్.. ఇంట్లో చెప్పే అబద్దం.. నేను బాగానే రాశాను.. వాళ్లే సరిగ్గా మార్కులు వేయలేదు అని.. అదే డైలాగ్ తో ట్రైలర్ ప్రారంభమయ్యి.. చివరి వరకు కూడా నవ్వులు తెప్పిస్తూనే ఉంది. ముగ్గురు స్నేహితులు.. తినడం, తాగడం తప్ప ఏం చేయరు. వారికి ముగ్గురు గర్ల్ ఫ్రెండ్స్.. ఇక ఇంట్లో కొడుకును సమర్థుడుగా చూడాలనుకునే తండ్రి..క్రిస్టియన్ అయిన హీరో.. హిందూ అయిన హీరోయిన్ తో పెళ్లి కోసం ఎన్ని పాట్లు పడ్డాడు.. మందు తప్ప ఇంకేమి చేతకాని ఆ కుర్రాళ్ళ జీవితాలు చివరికి ఏమయ్యాయి..? అనేది కథగా తెలుస్తోంది. మొత్తం విలేజ్ నేటివిటీతో అదరకొట్టేశాడు డైరెక్టర్. ఇక అమాయకమైన హీరోగా తిరువీర్ అద్భుతంగా నటించాడు. ఏంది సత్తీ గిది.. నేను లిప్ లాసమ్ పట్కరమ్మన్న.. లిప్ లాసమ్ అంటే గిట్ల మూతికి పెట్టుకోంగనే చెక్కుమని మెరవాలే.. నాలెక్క. గిది సూడు పెదువులు పలిగితే పెట్టుకునే దానిలాగా ఉంది. నువ్వే పెట్టుకో నీ బర్రె మూతికి అని అమ్మాయి చెప్పే డైలాగ్ హైలైట్ గా నిలిచింది. ప్రస్తుతం ఈ ట్రైలర్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ సినిమ జూన్ 2 న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమా ఎలాంటి హిట్ ను అందుకుంటుందో చూడాలి.
