ParamPorul: ఈ మధ్యకాలంలో క్రైమ్ థ్రిల్లర్స్, సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ అభిమానులను చాలాబాగా ఆకట్టుకుంటున్నాయి. సీట్ ఎడ్జ్ లో కూర్చోపెట్టి.. మూడుగంటలు విలన్ ఎవరు అని తెలుసుకోవడం పెద్ద టాస్క్ అని చెప్పాలి. డైరెక్టర్లు కూడా ఈ జోనర్ లో అభిమానులను అలరిస్తున్నారు. ఇక ఈ థ్రిల్లర్స్ కు భాషతో సంబంధం లేదు ఏ భాషలో రిలీజ్ అయినా ఓటిటీ అందరిదగ్గరకు తీసుకు వచ్చేస్తోంది. ఇక ఈ థ్రిల్లర్ లిస్ట్ లోకి మరో సినిమా వచ్చి యాడ్ అయ్యింది. అదే పరంపోరుల్. అమితాశ్ ప్రధాన్ మరియు శరత్‌కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సీ అరవింద్‌రాజ్ దర్శకత్వం వహించాడు. గత ఏడాది సెప్టెంబర్ 1న తమిళంలో థియేటర్లలో రిలీజైన పరంపోరుల్ మూవీ పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది.చిన్న సినిమాగా విడుదలైన ఈ మూవీ బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. ఇక ఫిబ్రవరి 1 నుంచి ఈ సినిమా ఈటీవీ విన్ లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది.
ఇక పరంపోరుల్ కథ విషయానికొస్తే.. గౌరీ(అమితాశ్ ప్రధాన్) ఒక సాధారణ మధ్యతరగతి యువకుడు. అతని చెల్లికి అనారోగ్యం కావడంతో ఆమెను బతికించుకోవడానికి డబ్బుకోసం కష్టపడుతుంటాడు. అయితే తండ్రిలా కష్టపడి సంపాదించకుండా దొంగతనాలు చేస్తాడు. అయితే గౌరీ .. ఒకప్పుడు అక్రమంగా విగ్రహాలను స్మగుల్ చేసే సద్గుణ దగ్గర పనిచేస్తాడు. అతడు చనిపోవడంతో ఇలా దొంగతనాలు చేస్తూ ఉంటాడు. ఇక ఒక రాత్రి పోలీసాఫీసర్ అయిన మైత్రేయన్ (శరత్ కుమార్) ఇంట్లో దొంగతనం చేయడానికి వెళ్లి దొరికిపోతాడు. ఇక లంచగొండి అయిన మైత్రేయన్.. ఎక్కువ డబ్బు సంపాదించి.. రిటైర్ అయ్యి.. హ్యాపీ గా జీవించాలని ఆశపడతాడు. అంతేకాకుండా విడిపోయిన భార్య, కూతురుకు ఎలాంటి బాధ రాకుండా చేయాలనీ డబ్బు కోసం ఆరాటపడుతుంటాడు. అలాంటి సమయంలోనే విగ్రహాలను అక్రమంగా తరలించే సద్గుణ దగ్గర పనిచేసిన గౌరీ చేతికి చిక్కడంతో.. అతడిని వాడుకొని డబ్బు సంపాదించాలని ప్లాన్ చేస్తాడు. ఇక ఆ ప్లాన్ ను గౌరికి చెప్పి.. హెల్ప్ చేయకపోతే జైలుకు పంపిస్తానని బెదిరిస్తాడు. ఒకపక్క చెల్లి ఆపరేషన్.. ఇంకోపక్క జైలు.. దీంతో గౌరీ, మైత్రేయన్ తో చేతులు కలుపుతాడు.
నాగపట్నం దగ్గరలోని ఒక ఊరి పొలంలో దాదాపు 1000 సంవత్సరాల కిందటి ఒక బుద్ధ విగ్రహం స్మగుల్ చేయాలని గౌరికి ఆఫర్ వస్తుంది. ఇక ఆ డీల్ ను ఎలా అయినా సెట్ చేసి రూ. 50 కోట్లు తీసుకోవాలని ప్లాన్ చేస్తారు. ఆ విగ్రహాన్ని తీసుకొని డీలర్స్ దగ్గరకు వెళ్లి రూ. 15 కోట్లకు బేరం ఆడతారు. అయితే ఆ విగ్రహం కోసం వెతికే మరో గ్యాంగ్ వీరిపై అటాక్ చేయడంతో ఆ విగ్రహం విరిగిపోతుంది. దీంతో తమకు డబ్బులు రావేమో అని అలాంటి విగ్రహాన్ని మరొకటి తయారుచేయించి అమ్మడానికి ప్లాన్ చేస్తారు. దానికోసం మైత్రేయన్ అంతకుముందు సంపాదించిన డబ్బు మొత్తాన్ని ఒక ప్రొఫెసర్ కు లంచంగా ఇస్తాడు. అది ఒరిజినల్ అని డీలర్స్ కు ప్రొఫెసర్ చెప్పడంతో డీల్ ఓకే అయ్యి డబ్బు చేతికి వచ్చాకా గౌరీని చంపేయాలని మైత్రేయన్ ప్లాన్ చేస్తాడు. ఇక లాస్ట్ మినిట్ లో పోలీసులు డీల్ జరిగే ప్రదేశానికి వచ్చి మైత్రేయన్ ను, డీలర్స్ ను అరెస్ట్ చేస్తారు. ఇక ఇక్కడే ట్విస్ట్ ఓపెన్ అవుతుంది. మొదట్లో గౌరీ గొర్రె అనుకున్న మైత్రేయన్ కు.. అసలు గొర్రె తానే అని తెలుస్తోంది. అసలు గౌరీ ఎవరు.. ? మైత్రేయన్ పై ఎందుకు పగ తీర్చుకున్నాడు..? పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసి మైత్రేయన్ ను జైలుకు ఎందుకు పంపాడు అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. డబ్బుకోసం ఎలాంటి నీచమైన పనులైన చేసే ఒక పోలీసాఫీసర్ పై ఒక యువకుడు రివెంజ్ తీర్చుకొనే కథ ఇది. రూ.5000,రూ.10000 కు ఆశపడి సాక్ష్యాలను తారుమారు చేస్తే.. నిజాయితీనే నమ్ముకున్న కుటుంబం రోడ్డుమీదకు వస్తాయి. అది ఎవరు ఆలోచించరు. తప్పుచేసి కూడా పశ్చాత్తాపడకుండా మైత్రేయన్ ఇంకా అత్యాశతో ముందుకు వెళ్లడం.. సమాజంలోని చాలామందిని గుర్తుకు తెస్తుంది. చదువుకున్న ఒక కుర్రాడు తన తండ్రికి జరిగిన అన్యాయాన్ని.. అది చేసిన పోలీస్ ను ఎంతో పక్కాగా ప్లాన్ వేసి జైలుకు పంపించడం ఆకట్టుకుంటుంది. టేకింగ్ పరంగా కూడా దర్శకుడు సక్సెస్ అయ్యాడు. ఈ చిన్న సినిమాకు యువర్ శంకర్ రాజా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్‌గా నిలిచింది. మరి ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మీద ఒక లుక్ వేయండి.