ParamPorul: ఈ మధ్యకాలంలో క్రైమ్ థ్రిల్లర్స్, సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ అభిమానులను చాలాబాగా ఆకట్టుకుంటున్నాయి. సీట్ ఎడ్జ్ లో కూర్చోపెట్టి.. మూడుగంటలు విలన్ ఎవరు అని తెలుసుకోవడం పెద్ద టాస్క్ అని చెప్పాలి. డైరెక్టర్లు కూడా ఈ జోనర్ లో అభిమానులను అలరిస్తున్నారు. ఇక ఈ థ్రిల్లర్స్ కు భాషతో సంబంధం లేదు ఏ భాషలో రిలీజ్ అయినా ఓటిటీ అందరిదగ్గరకు తీసుకు వచ్చేస్తోంది.
గత ఏడాది సెప్టెంబర్ 1న తమిళంలో థియేటర్లలో రిలీజైన పరంపోరుల్ మూవీ పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది.చిన్న సినిమాగా విడుదలై పరంపోరుల్ మూవీ బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమాలో అమితాశ్ ప్రధాన్ మరియు శరత్‌కుమార్ ప్రధాన పాత్రల్లో నటించారు.ఈ సినిమా కథ, స్క్రీన్‌ప్లేతో పాటు శరత్‌కుమార్ యాక్టింగ్‌కు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు దక్కాయి. పరంపోరుల్ కథ మొత్తం పురాతన విగ్రహాల అక్రమ రవాణా నేపథ్యంలో సాగుతుంది.అయితే అదే టైమ్‌లో రజనీకాంత్ జైలర్ రిలీజ్ కావడం, రెండు…