హిందీ బెల్ట్‌లో నార్త్ అబ్బాయి- సౌత్ అమ్మాయి లవ్ స్టోరీలకు బాగా క్లిక్ అవుతుంటాయి. టూ స్టేట్స్ అండ్ చెన్నై ఎక్స్ ప్రెస్, రీ రిలీజ్‍లో హిట్ అందుకున్న సనమ్ తేరీ కసమ్ బెస్ట్ ఎగ్జాంపుల్స్. ఇప్పుడు ఇలాంటి క్రాస్ కల్చరల్ స్టోరీని సిద్ధం చేసింది మడాక్ ఫిల్మ్స్. ఢిల్లీ అబ్బాయి- కేరళ కుట్టీ మధ్య ప్రేమ కథకు ఫన్నీని జోడించి పరమ్ సుందరి గా చూపించబోతున్నాడు దస్వీ ఫేం తుషార్ జలోటా. పరమ్ సచ్ దేవ్‌గా సిద్దార్థ్ మల్హోత్రా, తేకపట్టు సుందరి దామోదర్ పిళ్లైగా జాన్వీ కనిపించబోతున్నారు.
Also Read : JR. NTR : ఏపీ సీఎం చంద్రబాబుకు జూనియర్ ఎన్టీఆర్ కృతజ్ఞతలు
పరమ్ సుందరిపై బజ్ క్రియేట్ అయ్యేలా చేయడంలో సక్సెస్ అయ్యాయి టీజర్ అండ్ పరేదశియా అండ్ రెయిన్ సాంగ్స్. తాజాగా వదిలిన ట్రైలర్ ఇంటెన్స్ క్రియేట్ చేస్తోంది. కేరళ అందమైన ప్రాంతాలను కలర్ ఫుల్‌గా కాప్చర్ చేసినట్లు కనిపిస్తోంది. అయితే ఇది చెన్నై ఎక్స్ ప్రెస్‌కి రెప్లికాలా ఉందన్న కామెంట్స్ తొలి నుండి వినిపించగా.. ట్రైలర్ మరింత స్ట్రాంగ్ చేసినట్లయ్యింది. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడ్డ ఈ బొమ్మ ఆగస్టు 29న రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. బేసికల్లీ సౌత్ మూలాలున్న జాను పాప పరమ్ సుందరిలో దక్షిణాది అమ్మాయిగా చీర కట్టుతో ఆకట్టుకుంది. ఇప్పటికే లవ్ స్టోరీలు లేక మొహం వాసిపోయి ఉన్న నార్త్ బెల్ట్‌లో ఈ సినిమా కు హిట్ అయ్యే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. సౌత్‌లో టాప్ హీరోలెవరో జాన్వీతో ఇమిటేట్ దర్శకుడు చేయించడం బాగుంది. పరమ్ సుందరి జాన్వీ పాపకు హిట్ ఇస్తుందో లేదో చూడాలి.
