Hunt Item Song: సిగ్నేచర్ స్టెప్ తో అదరగొట్టిన సుధీర్ బాబు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hunt Item Song: సుధీర్ బాబు కథానాయకుడిగా వి. ఆనంద ప్రసాద్ నిర్మిస్తున్నసినిమా ‘హంట్’. దీనికి మహేష్ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకాంత్, ‘ప్రేమిస్తే’ ఫేమ్ భరత్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ నుండి ‘పాపతో పైలం…’ పాటను తాజాగా విడుదల చేశారు.
‘పటాకా సాంగ్ ఆఫ్ ది ఇయర్’ అంటూ విడుదల చేసిన ఈ టైమ్ సాంగ్ లో సుధీర్ బాబుతో పాటు అప్సరా రాణి స్టెప్పులు వేశారు. ‘క్రాక్’, ‘సీటీమార్’ తర్వాత మరోసారి ప్రత్యేక గీతంలో ఆమె సందడి చేశారు. వీరితో పాటు శ్రీకాంత్, భరత్ కూడా డ్యాన్స్ చేశారు. ఈ పాటకు యశ్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించగా, జిబ్రాన్ స్వరాలు అందించారు. దానికి తగ్గట్టుగా కాసర్ల శ్యామ్ రచన చేయగా, దీనిని మంగ్లీ, ‘పుష్ప’ ఫేమ్ (‘ఏ బిడ్డా ఇది నా అడ్డా…’ పాడిన) నకాష్ అజీజ్ ఆలపించారు. ఈ మాస్ ఐటమ్ సాంగ్ విడుదలైన కొన్ని క్షణాల్లోనే వైరల్ అయ్యింది. విజువల్స్ చూస్తే పబ్‌లో ఖర్చుకు ఎక్కడా వెనుకాడకుండా రిచ్‌గా షూట్ చేసినట్లు అర్థం అవుతోంది.
Also Read
- Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
- Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
- Vijay Deverakonda: "బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!".. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
- Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత వి. ఆనంద ప్రసాద్ మాట్లాడుతూ, ”సినిమాలో రెండు పాటలు ఉన్నాయి. ఈ రోజు ‘పాపతో పైలం’ విడుదల చేశాం. దీనికి మంచి స్పందన లభిస్తోంది. సుధీర్ బాబు ఎనర్జీగా, స్టైలుగా డ్యాన్స్ చేశారని, సాంగ్ బావుందని జనం చెబుతున్నారు. ఇదొక స్టైలిష్ అండ్ హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్. సుధీర్ బాబు, శ్రీకాంత్, భరత్ పోలీస్ ఆఫీసర్ రోల్స్ చేశారు. ఆల్రెడీ విడుదల చేసిన టీజర్‌కు మంచి స్పందన లభిస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. త్వరలో విడుదల తేదీ వెల్లడిస్తాం” అని చెప్పారు. మైమ్ గోపి, కబీర్ దుహన్ సింగ్, మౌనిక రెడ్డి, గోపరాజు రమణ, మంజుల, చిత్రా శుక్ల, సుపూర్ణ మల్కర్, సంజయ్ స్వరూప్, రవి వర్మ, ‘జెమినీ’ సురేష్, అభిజీత్ పూండ్ల, కోటేష్ మన్నవ, సత్య కృష్ణన్ తదితరులు ఇతర ప్రధాన పాత్రలను పోషించారు.
తాజావార్తలు
-
Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
Volkswagen ID.Tiguan EV: 600 కి.మీ. రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు ఇవే!
-
CJP Protest: “మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు”.. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
ట్రెండింగ్
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!