NTV Telugu Site icon

PAPA: తమిళంలో దా…దా.. తెలుగులో పా…పా.. ఫస్ట్ లుక్ చూశారా?

Papa Movie

Papa Movie

PAPA aka ONanna First look Release: ఒకప్పుడు వేరే భాషల్లో సూపర్ హిట్ అయిన సినిమాలను తెలుగులో రీమేక్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపించేవారు. కానీ ఇప్పుడు నేటివిటీ దెబ్బతినకుండా డబ్ చేసి రిలీజ్ చేసేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ కోవలో తమిళంలో, కన్నడలో, మళయాలంలో సూపర్ హిట్ అయిన ఎన్నో సినిమాలు తెలుగు ప్రేక్షకుల ముందుకు రాగా ఇప్పుడు మరో సినిమా కూడా అలా వచ్చేందుకు రెడీ అవుతోంది. అవును తమిళ్ లో బ్లాక్ బస్టర్ అయిన దా…దా… మూవీ ఇప్పుడు తెలుగులో రిలీజ్ అవుతోంది. ఒలింపియా మూవీస్ సంస్థ ఎస్ అంబేత్ కుమార్ సమర్పణలో శ్రీమతి నీరజ పాన్ ఇండియా మూవీస్, జె కె ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా ఎమ్మెస్ రెడ్డి నిర్మాతగా శ్రీకాంత్ నూనెపల్లి, శశాంక్ చెన్నూరు సహనిర్మాతలుగా పా…పా అనే పేరుతో ఇప్పుడు తెలుగులో రిలీజ్ కానుంది.

Athidhi Web Series Review : అతిథి వెబ్ సిరీస్ రివ్యూ

ఇక తాజాగా ఈ సినిమా తెలుగు ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సందర్బంగా నిర్మత ఎమ్మెస్ రెడ్డి మాట్లాడుతు తమిళంలో మంచి యూత్‌ఫుల్, లవ్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా నిలిచి కొన్ని కోట్ల రూపాయలు వసూలు చేసిన దా…దాని పా…పాగా తెలుగులో తీసుకొస్తున్నామని, ఎన్నో పెద్ద సంస్థలు పోటీ పడినా తెలుగులో ఇలాంటి సినిమాని మా సంస్థ తీసుకురావాలని భారీగా ఖర్చు పెట్టి విడుదల చేయడానికి రెడీ అయ్యామని అన్నారు. అతి త్వరలో గ్రాండ్ గా ట్రైలర్ లాంచ్ తో మీ ముందుకు రాబోతున్నామని పేర్కొన్న ఆయన తెలుగు ప్రేక్షకులు కొత్తదనాన్ని ప్రోత్సహించడంలో ముందుంటారు అలానే పా…పాని కూడా తెలుగులో మంచి బ్లాక్ బస్టర్ చేస్తారని ఆశిస్తున్నామని అన్నారు. కవిన్, అపర్ణా దాస్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమాలో మోనికా చిన్నకోట్ల, ఐశ్వర్య, భాగ్యరాజ, విటివి గణేష్ ఇతర కీలక పాత్రలలో నటించారు. జెన్ మార్టిన్ సంగీతం అందించిన ఈ సినిమాను దర్శకుడు గణేష్ కె బాబు డైరెక్ట్ చేశారు.

Show comments