తమిళ చిత్ర పరిశ్రమలో కలకలం రేపిన డ్రగ్స్ వవ్యహారంలో ఇప్పటికే నటుడు శ్రీరామ్ అరెస్ట్ అయ్యాడు. విచారణలో భాగంగా శ్రీరామ్ ఇచ్చిన సమాచారంతో తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన మరో నటుడు కృష్ణను కూడా అరెస్ట్ చేసారు పోలీసులు. కృష్ణ తో పాటు డ్రగ్స్ డీలర్ కెవిన్ కు కూడా అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు హాజరుపరచగా జూలై పదవ తేది వరకు రిమాండ్ విధించింది కోర్డు. నటుడు కృష్ణ ఇంటిలో సోదాలు నిర్వహించిన పోలీసులు కీలక విషయాలు కనుగొన్నారు.
Also Read : Priya Vadlamani : పరువాల ప్రదర్శన చేస్తున్న ప్రియా వడ్లమాని..
నటుడు కృష్ణ ఇంటిలో స్వాధీనం చేసుకున్న లాప్ టాప్, పాత సెల్ ఫోన్ లో అనేక మంది కాల్ ఉందని గుర్తించారు. ఆ కాల్ డేటా రికవరీ పై దృష్టి పెట్టారు పోలిసులు. కృష్ణకు తమిళ యువ దర్శకులు అత్యంత సన్నిహితంగా ఉండడంతో అదిశగా కూడా కాల్ డేటాను అన్వేషిస్తున్నారు పోలీసులు. ఇటు టాలీవుడ్ లోనూ కృష్ణకు అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయని గుర్తించారు నటుడు కృష్ణ మరెవరో కాదు ప్రముఖ దర్శకుడు విష్ణువర్ధన్ సోదరుడు. తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన పంజా సినిమా దర్శకుడు విష్ణు వర్దన్ కు కృష్ణ స్వయానా తమ్ముడు. అన్నస్టార్ దర్శకుడు కావడంతో కోలీవుడ్ లో సులువుగా సినిమా అవకాశాలు పోందిన కృష్ణ. ఆ దశలోనే మత్తుకు అలవాటు పడి డ్రగ్స్ వాడుతు మరికొందరు నటులకు సరఫరా చేసాడు. రెండు రోజులగా పోలీసులు చేస్తున్న విచారణలో పలువురు నటుల సమాచారం ఇచ్చిడు నటుడు కృష్ణ. దాంతో త్వరలో మరికొందరు నటులను అదుపులోకి తీసుకొనే అవకాశం ఉందని తెలుస్తోంది
