NTV Telugu Site icon

Panchathantram: ఐదు జంటల కథతో అదిరిన ట్రైలర్!

Panchatantram

Panchatantram

Panchathantram: టికెట్ ఫ్యాక్టరీ, ఒరిజిన‌ల్స్ ప‌తాకాల‌పై అఖిలేష్ వ‌ర్ద‌న్‌, సృజ‌న్ ఎర‌బోలు నిర్మించిన ఆంథాలజీ మూవీ ‘పంచతంత్రం’. బ్ర‌హ్మానందం, స్వాతి రెడ్డి, స‌ముతిర కని, రాహుల్ విజ‌య్‌, శివాత్మిక రాజ‌శేఖ‌ర్‌, న‌రేష్ అగ‌స్త్య‌, దివ్య ద్రిష్టి, వికాస్ ముప్ప‌ల, ఉత్తేజ్ ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. హ‌ర్ష పులిపాక దీన్ని డైరెక్ట్ చేశారు. డిసెంబ‌ర్ 9న ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కానుంది. శ‌నివారం ఈ సినిమా ట్రైల‌ర్‌ను స్టార్ హీరోయిన్ ర‌ష్మిక మంద‌న్న విడుద‌ల చేసిన చిత్ర యూనిట్‌కి అభినంద‌న‌లు తెలియ‌జేసింది.

‘పంచతంత్రం’ ట్రైల‌ర్‌ను గ‌మ‌నిస్తే, ఇది ఐదు జంట‌ల‌కు సంబంధించిన క‌థ అని అర్థ‌మ‌వుతుంది. బ్ర‌హ్మానందం ఈ ఐదు క‌థ‌ల‌కు పంచేద్రియాలు అనే పేరు పెట్టి త‌న కోణంలో స్టార్ట్ చేశారు. జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఉంటాయి. సంతోషాలే కాదు.. బాధ‌లు కూడా వ‌స్తుంటాయి. అలా వ‌చ్చిన‌ప్పుడు మ‌నం వాటిని ఎలా స్వీక‌రించాం? మ‌న ప‌నుల‌ను ఎంత బాధ్య‌త‌గా పూర్తి చేస్తూ ముందుకెళ్లామ‌నేది ఈ కథలసారమని ఇందులో పాత్ర ద్వారా తెలుస్తోంది. తెరపై మ‌న‌కు క‌నిపించ‌బోయే ఐదు జంట‌ల‌కు ఒక్కో క‌థ .. ఒక్కో ర‌క‌మైన ప్ర‌యాణం.. అవ‌న్నీ ఎలాంటి ముగింపుతో ఎండ్ అయ్యాయ‌నేది మూవీ చూసి తెలుసుకోవాల్సిందే. ఫీల్ గుడ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా, హార్ట్ ట‌చింగ్ ఎమోష‌న్స్‌తో ఈ సినిమా నిండిపోయిందని ఈ ట్రైలర్ బట్టి అర్థమౌతోంది. నటీనటులు కాకుండా కేవలం పాత్రలే కనిపిస్తుండటం మరో విశేషం. ఈ చిత్రానికి సంగీతాన్ని ప్రశాంత్ ఆర్. విహారి స్వరపరచగా, సినిమాటోగ్రఫీని రాజ్ కె. నల్లి అందించారు. వీరిద్దరి పనితనం ఈ ట్రైలర్ లో స్పష్టంగా కనిస్తోంది. రొటీన్ కు భిన్నంగా తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా సరికొత్త అనుభూతిని కలిస్తుందనే హామీని ఈ ట్రైలర్ తో దర్శకుడు హర్ష పులిపాక ఇచ్చారు.

Show comments