Panchathantram: ఐదు జంటల కథతో అదిరిన ట్రైలర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Panchathantram: టికెట్ ఫ్యాక్టరీ, ఒరిజినల్స్ పతాకాలపై అఖిలేష్ వర్దన్, సృజన్ ఎరబోలు నిర్మించిన ఆంథాలజీ మూవీ ‘పంచతంత్రం’. బ్రహ్మానందం, స్వాతి రెడ్డి, సముతిర కని, రాహుల్ విజయ్, శివాత్మిక రాజశేఖర్, నరేష్ అగస్త్య, దివ్య ద్రిష్టి, వికాస్ ముప్పల, ఉత్తేజ్ ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. హర్ష పులిపాక దీన్ని డైరెక్ట్ చేశారు. డిసెంబర్ 9న ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కానుంది. శనివారం ఈ సినిమా ట్రైలర్‌ను స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న విడుదల చేసిన చిత్ర యూనిట్‌కి అభినందనలు తెలియజేసింది.
‘పంచతంత్రం’ ట్రైలర్‌ను గమనిస్తే, ఇది ఐదు జంటలకు సంబంధించిన కథ అని అర్థమవుతుంది. బ్రహ్మానందం ఈ ఐదు కథలకు పంచేద్రియాలు అనే పేరు పెట్టి తన కోణంలో స్టార్ట్ చేశారు. జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఉంటాయి. సంతోషాలే కాదు.. బాధలు కూడా వస్తుంటాయి. అలా వచ్చినప్పుడు మనం వాటిని ఎలా స్వీకరించాం? మన పనులను ఎంత బాధ్యతగా పూర్తి చేస్తూ ముందుకెళ్లామనేది ఈ కథలసారమని ఇందులో పాత్ర ద్వారా తెలుస్తోంది. తెరపై మనకు కనిపించబోయే ఐదు జంటలకు ఒక్కో కథ .. ఒక్కో రకమైన ప్రయాణం.. అవన్నీ ఎలాంటి ముగింపుతో ఎండ్ అయ్యాయనేది మూవీ చూసి తెలుసుకోవాల్సిందే. ఫీల్ గుడ్ ఎంటర్టైనర్గా, హార్ట్ టచింగ్ ఎమోషన్స్‌తో ఈ సినిమా నిండిపోయిందని ఈ ట్రైలర్ బట్టి అర్థమౌతోంది. నటీనటులు కాకుండా కేవలం పాత్రలే కనిపిస్తుండటం మరో విశేషం. ఈ చిత్రానికి సంగీతాన్ని ప్రశాంత్ ఆర్. విహారి స్వరపరచగా, సినిమాటోగ్రఫీని రాజ్ కె. నల్లి అందించారు. వీరిద్దరి పనితనం ఈ ట్రైలర్ లో స్పష్టంగా కనిస్తోంది. రొటీన్ కు భిన్నంగా తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా సరికొత్త అనుభూతిని కలిస్తుందనే హామీని ఈ ట్రైలర్ తో దర్శకుడు హర్ష పులిపాక ఇచ్చారు.
Also Read
- Priyanka Chopra: ఆస్కార్ విజేత రస్సెల్ క్రోతో ప్రియాంక చోప్రా.. హాలీవుడ్లో మరో భారీ ప్రాజెక్ట్‌కు రెడీ!
- Dhurandhar : నెట్‌ఫ్లిక్స్‌లో 'ధురంధర్' ప్రపంచ రికార్డు..
- God Of War : 'డ్రాగన్' తర్వాత కొత్త ప్రాజెక్ట్‌పై ఎన్టీఆర్ ఫోకస్
- Dancers Association : డ్యాన్సర్స్ అసోసియేషన్‌కు ఫిల్మ్ ఫెడరేషన్ బిగ్ షాక్
తాజావార్తలు
-
Bajaj Pulsar N160 S N160 SS: బజాజ్ కొత్త పల్సర్ N160 S, N160 SS విడుదల.. 4-వాల్వ్ ఇంజన్, ధరలు, ఫీచర్లు ఇవే!
-
Saturday Horoscope: ఆ రాశి వారు శత్రువులపై పైచేయి సాధిస్తారు.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Priyanka Chopra: ఆస్కార్ విజేత రస్సెల్ క్రోతో ప్రియాంక చోప్రా.. హాలీవుడ్లో మరో భారీ ప్రాజెక్ట్‌కు రెడీ!
-
HAPIDA SKYNeX Flying Vehicle: ట్రాఫిక్‌కు చెక్ పెట్టే ‘ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ కార్’.. యువకుడి అద్భుత ఆవిష్కరణ! (వీడియో)
-
Travis Head: చరిత్ర సృష్టించిన కాటేరమ్మకొడుకు.. ఒక్క ఓటుతో సంచలన విజయం..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!