‘పంచతంత్రం’ అనే ఆసక్తికర టైటిల్ తో ‘ఇవి మీ కథలు, మన కథలు’ అంటూ ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ను మన ముందుకు తీసుకొస్తున్నారు దర్శకుడు హర్ష పులిపాక. బ్రహ్మానందం, సముతిర కని, స్వాతి రెడ్డి, శివాత్మిక రాజశేఖర్, రాహుల్ విజయ్, ‘మత్తు వదలరా’ ఫేమ్ నరేష్ అగస్త్య ప్రధాన పాత్రలు పోషిస్తున్న సినిమా ‘పంచతంత్రం’. హర్ష పులిపాక రచన, దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి అఖిలేష్ వర్ధన్, సృజన్ ఎరబోలు నిర్మాతలు. కొన్ని రోజుల క్రితం వరుసగా పోస్టర్లు విడుదల చేసి సినిమాలోని పాత్రలను పరిచయం చేసిన మేకర్స్ తాజాగా టీజర్ ను విడుదల చేశారు. టీజర్ చాలా ఆసక్తికరంగా ఉంది.
Read Also : ఎందుకు ఏడుస్తున్నారు ? ప్రకాష్ రాజ్ ప్యానల్ కు నరేష్ కౌంటర్
‘అడవిలో ఉన్న జంతువులన్నీ కూడు, గూడు, తోడు దొరికాక నాలుగో జీవనాధారం కోసం ఓ చోటులో కలుసుకున్నాయి. ఆ జీవనాధారమే కథలు. సింహం విసిరిన పంజా కథలు, చిరుత పెట్టిన పరుగుల కథలు, ఈగ చెప్పే బాహుబలి కథలు వినడానికి వచ్చిన వాటికి ఒక ముసలి తాబేలు కన్పించింది. కదలడానికి కష్టపడే నువ్వేం కథలు చెబుతావని అడగ్గా, జవాబగునా ఆకాశం అంత అనుభవంతో కథలు మొదలయ్యాయి” అంటూ ఓ వాయిస్ తో డైలాగులు చెబుతుండగా, సన్నివేశాలు కూడా ఆ వాయిస్ తో పాటే కొనసాగుతున్నాయి. ముఖ్యంగా చాలా రోజుల తరువాత బ్రహ్మానందాన్ని తెరపై చూడడం ప్రేక్షకులను ఆనందాన్ని కలిగించే విషయం. ఆసక్తికరంగా సాగిన ఈ టీజర్ ను మీరు కూడా వీక్షించండి.
