ఎందుకు ఏడుస్తున్నారు ? ప్రకాష్ రాజ్ ప్యానల్ కు నరేష్ కౌంటర్

పలు ఆసక్తికర పరిణామాల మధ్య ఎట్టకేలకు మంచు విష్ణు ‘మా’ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. మరోవైపు ఓడిపోయిన ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులు రాజీనామాలు చేస్తూ సంచలన ఆరోపణలు చేశారు. పైగా బెనర్జీ వంటి నటులు పలు ఆరోపణలు చేస్తూ ఎమోషనల్ అయ్యారు. ఈ రోజు మంచు విష్ణు ‘మా’ అధ్యక్షుడిగా పదవి స్వీకరించిన సందర్భంగా మాజీ ‘మా’ అధ్యక్షుడు నరేష్ మాట్లాడుతూ “కలిసి పనిచేస్తాం అన్న వాళ్ళు ఎందుకు రిజైన్ చేశారు. బయట ఉండి ప్రశ్నించడం ఏంటి…? మోడీ గెలిచాడు అని… కాంగ్రెస్ వాళ్లు దేశం వదిలి వెళ్ళలేదు కదా..!

Read Also : మా అధ్యక్షుడిగా విష్ణు ప్రమాణ స్వీకారం

ఎందుకు ఏడుస్తున్నారు ? మగవాళ్ళు కూడా ఈరోజు ము***ల్లా ఏడుస్తున్నారు.. ఏడ్చే మగాళ్లను నమ్మొద్దు. ‘మా’ అనేది కుటుంబం. గెస్ట్ గా వచ్చిన వాళ్లే ఇది కుటుంబం కాదు అంటారు. ఫ్యాక్షనిజం మానేద్దాం కలిసి పనిచేద్దాం. ప్రమాణ స్వీకారం త్వరలో ప్రకటిస్తాం. ఇవాళ నేను ఛార్జ్ విష్ణు కి ఇచ్చాను. విష్ణుని ఎవరైనా డిస్టర్బ్ చేస్తే బాగోదు. ప్రశాంతంగా పని చేసుకోనివ్వండి. ఎమోషన్స్, ఫ్రస్ట్రేషన్ వద్దు. నేను పేర్లు చెప్పదలుచుకోలేదు కానీ గెలిచాక కూడా ఆరోపణలు చేయడం ఏంటి? రిజైన్ చేసిన ఈసీ మెంబర్స్ గురించి కొత్త ప్యానల్ చూసుకుంటుంది.
ఓడినా గెలిచినా కలిసి పని చేస్తాం అన్నారు. మరి ఇప్పుడేమైంది?” అంటూ ప్రకాష్ అజ్ ప్యానల్ కు కౌంటర్ వేశారు నరేష్.

-Advertisement-ఎందుకు ఏడుస్తున్నారు ? ప్రకాష్ రాజ్ ప్యానల్ కు నరేష్ కౌంటర్

Related Articles

Latest Articles