Site icon NTV Telugu

పనామా పేపర్ లీక్స్ కేసు.. ఈడీ ముందుకు మరో స్టార్ హీరో ..?

ajay devagan

ajay devagan

బాలీవుడ్ లో పనామా పేపర్ లీక్స్ కేసు హడలు పుట్టిస్తోంది. విదేశాల్లో అక్రమంగా పెట్టుబడులు పెడుతున్నారని ఈడీ విచారణలో తెలియడంతో బాలీవుడ్ ప్రముఖులను ఈడీ విచారిస్తుంది. ఇప్పటికే సోమవారం బచ్చన్ కోడలు ఐశ్వర్యరాయ్ ఈడీ విచారణ ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. 2016లో పనామా నుంచి నడిచే ఓ లా కంపెనీకి చెందిన రూ.11.5 కోట్లకు సంబంధించిన ట్యాక్స్ డాక్యుమెంట్ లీకు అయ్యాయి. వాటి గురుంచి మూడు గంటలు పలు రకాల ప్రశ్నలను ఐష్ ని అడిగారు అధికారులు. ఆమెనుంచి పలు ఆసక్తికరమైన సమాధానాలను అధికారులు రాబట్టినట్లు సమాచారం.

https://ntvtelugu.com/naveen-polishetti-host-radhe-shyam-pre-release-event/

ఇక తాజాగా ఈ కేసులో మరో స్టార్ హీరోను కూడా ఈడీ విచారించనున్నదట. ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్ గన్ కూడా ఈ వ్యవహారాల్లో ఈడీ ఎదుట హాజరు కావచ్చని అంటున్నారు. పనామా పేపర్ లీక్స్ అయిన సమయంలో అజయ్ తన వాదన వినిపించారు. తానూ ఏదైతే పెట్టుబడి పెట్టానో అవన్నీ నిజాయితీగా చేసినవేనని, వాటికి సరైన లెక్కలు ఉన్నాయని తెలిపారు. ఈ విషయమై అజయ్ దేవగన్ ని కూడా ఈడీ విచారించనుందని తెలుస్తోంది. మరో రెండు రోజుల్లో అజయ్ ని ఈడీ ప్రశ్నించనున్నారట. మరి అజయ్ ఎలాంటి సమాధానాలు ఇస్తాడో చూడాలి

Exit mobile version