Yashoda: సమంత సినిమాకు పాన్ ఇండియా స్టార్స్ దన్ను!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yashoda Movie: సమంత ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘యశోద’. ఇటీవల విడుదలైన టీజర్ కి అనూహ్య స్పందన లభించిన విషయం తెలిసిందే. దాంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ట్రైలర్ కోసం ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు. వాళ్ళ ఆసక్తిని మరింత పెంచుతూ పాన్ ఇండియా హీరోలతో ట్రైలర్ విడుదల ప్లాన్ చేసింది చిత్ర బృందం. నవంబర్ 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ‘యశోద’ ట్రైలర్‌ను అక్టోబర్ 27న పేరొందిన పాన్ ఇండియన్ హీరోలు విడుదల చేయనున్నట్లు తెలపడంతో అటు అభిమానుల్లో, ఇటు ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
తెలుగులో హీరో విజయ్ దేవరకొండ, తమిళంలో సూర్య, కన్నడలో రక్షిత్ శెట్టి, మలయాళంలో దుల్కర్ సల్మాన్, హిందీలో వరుణ్ ధావన్ ‘యశోద’ ట్రైలర్ విడుదల చేయనున్నారు. శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ‘యశోద’ విడుదల కానుంది. చిత్ర నిర్మాణంలో ఖర్చుకు వెనకాడనట్టే, ప్రమోషన్స్ కూడా రొటీన్ కి భిన్నంగా పాన్ ఇండియా ఇమేజ్‌కు ఏమాత్రం తగ్గకుండా వినూత్నంగా జరుపుతున్నారు దర్శకులు హరి, హరీష్; నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్. ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్, శత్రు, మధురిమ, కల్పికా గణేష్, దివ్య శ్రీపాద, ప్రియాంకా శర్మ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మణిశర్మ స్వర రచన చేసిన ఈ సినిమాకు మాటలను పులగం చిన్నారాయణ, డా. చల్లా భాగ్యలక్ష్మీ అందిస్తున్నారు.
Also Read
- PEDDI : పెద్ది ఓవర్శీస్ టాక్.. బాగా తీసుంటే బాగుండేది కద బుచ్చి..
- Upasana Konidela: ‘పెద్ది’ థియేటర్లో మెగా కోడలి ఊరమాస్ రచ్చ.. చరణ్ ఎంట్రీకి పేపర్లు ఎగరేసిన ఉపాసన!
- Peddi OTT Partner: ‘పెద్ది’ ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- AamirKhan Marriage: ఆమిర్ ఖాన్ మూడో పెళ్లికి ముహూర్తం ఫిక్స్ అంటా? నెట్టింట్ల వైరల్ అవుతున్న లగ్గం డేట్!
తాజావార్తలు
-
PEDDI : పెద్ది ఓవర్శీస్ టాక్.. బాగా తీసుంటే బాగుండేది కద బుచ్చి..
-
AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ భేటీ.. అమరావతి అభివృద్ధి, కీలక సంక్షేమ నిర్ణయాలపై చర్చ!
-
Upasana Konidela: ‘పెద్ది’ థియేటర్లో మెగా కోడలి ఊరమాస్ రచ్చ.. చరణ్ ఎంట్రీకి పేపర్లు ఎగరేసిన ఉపాసన!
-
Hero Flex Fuel Bikes: హీరో మోటోకార్ప్ సంచలనం.. దేశంలో తొలి ఫ్లెక్స్-ఫ్యూయల్ బైక్స్ స్ప్లెండర్, HF డీలక్స్ మార్కెట్లోకి..
-
Virat Kohli – Rohit Sharma: కోహ్లీ-రోహిత్‌కు అగ్నిపరీక్ష.! రాణిస్తే వరల్డ్‌కప్.. విఫలమైతే కెరియర్ ముగిసినట్లేనా?
ట్రెండింగ్
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!