Site icon NTV Telugu

Yashoda: సమంత సినిమాకు పాన్ ఇండియా స్టార్స్ దన్ను!

Yashoda Pan India Stars

Yashoda Pan India Stars

Yashoda Movie: సమంత ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘యశోద’. ఇటీవల విడుదలైన టీజర్ కి అనూహ్య స్పందన లభించిన విషయం తెలిసిందే. దాంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ట్రైలర్ కోసం ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు. వాళ్ళ ఆసక్తిని మరింత పెంచుతూ పాన్ ఇండియా హీరోలతో ట్రైలర్ విడుదల ప్లాన్ చేసింది చిత్ర బృందం.  నవంబర్ 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ‘యశోద’ ట్రైలర్‌ను అక్టోబర్ 27న పేరొందిన పాన్ ఇండియన్ హీరోలు విడుదల చేయనున్నట్లు తెలపడంతో అటు అభిమానుల్లో, ఇటు ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

తెలుగులో హీరో విజయ్ దేవరకొండ, తమిళంలో సూర్య, కన్నడలో రక్షిత్ శెట్టి, మలయాళంలో దుల్కర్ సల్మాన్, హిందీలో వరుణ్ ధావన్ ‘యశోద’ ట్రైలర్ విడుదల చేయనున్నారు. శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ‘యశోద’ విడుదల కానుంది. చిత్ర నిర్మాణంలో ఖర్చుకు వెనకాడనట్టే, ప్రమోషన్స్ కూడా రొటీన్ కి భిన్నంగా పాన్ ఇండియా ఇమేజ్‌కు ఏమాత్రం తగ్గకుండా వినూత్నంగా జరుపుతున్నారు దర్శకులు హరి, హరీష్; నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్. ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్, శత్రు, మధురిమ, కల్పికా గణేష్, దివ్య శ్రీపాద, ప్రియాంకా శర్మ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మణిశర్మ స్వర రచన చేసిన ఈ సినిమాకు మాటలను పులగం చిన్నారాయణ, డా. చల్లా భాగ్యలక్ష్మీ అందిస్తున్నారు.

Exit mobile version