Site icon NTV Telugu

“ఆదిపురుష్” కోసం ప్రభాస్ సాహసం

Maharashtra government has taken a key decision to halt the shootings of films

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఊరికే పాన్ ఇండియా స్టార్ అయిపోలేదు. సినిమాల కోసం ఆయన పడుతున్న పాట్లు, కష్టాలు అభిమానులు చూస్తూనే ఉన్నారు. ‘బాహుబలి’గా మారడానికి భారీగా కండలు పెంచడం, సినిమా సినిమాకూ సరికొత్త మేకోవర్, ఫిజికల్ ట్రాన్స్ఫార్మేషన్ అనే చిన్న విషయం కాదు. స్క్రీన్ పై ఆయన పాన్ ఇండియా స్టార్ గా ప్రేక్షకులను మెప్పించడం వెనుక మనకు తెలియని ఎన్నో విషయాలు ఉంటాయి. తాజాగా ప్రభాస్ “ఆదిపురుష్” కోసం మరో సాహసం చేస్తున్నాడట. ప్రస్తుతం ఈ పాన్ ఇండియా మూవీ క్లైమాక్స్ షూటింగ్ జరుగుతోంది. అక్టోబర్ 9 వరకు 26 రోజులు సాగే ఈ లాంగ్ షెడ్యూల్ లో హై ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్ సన్నివేశాలను తెరకెకెక్కించనున్నారట. ఈ సన్నివేశాలను ప్రభాస్ డూప్ లేకుండా చేయనున్నారట. దానికోసం స్టంట్స్ రిహార్సల్స్ చేయడం కూడా మొదలుపెట్టాడట.

Read Also : చిక్కుల్లో సూపర్ స్టార్ అభిమానులు

“ఆదిపురుష్” షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రం “రామాయణం” ఆధారంగా తెరకెక్కిస్తున్న పౌరాణిక డ్రామా. ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. రాముడి పాత్రలో ప్రభాస్ నటించనున్నారు. ఈ చిత్రంలో కృతి సనన్, సైఫ్ అలీ ఖాన్, సన్నీ సింగ్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ మూవీ షూటింగ్ ను వచ్చే నెల సగంలోగా కంప్లీట్ చేయాలని దర్శకుడు ఓం రౌత్ నిర్ణయించుకున్నారట.

Exit mobile version