Site icon NTV Telugu

Prabhas: ఆ కటౌట్ కి ఆ మాత్రం రెమ్యునరేషన్ ఇవ్వొచ్చు

Prabhas

Prabhas

ప్రస్తుతం ఇండియాలో హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోల్లో… ప్రభాస్‌దే టాప్ ప్లేస్. బాలీవుడ్‌ ఖాన్ త్రయాన్ని సైతం ప్రభాస్ వెనక్కి నెట్టేసేలా హిందీలో క్రేజ్ సొంతం చేసుకున్నాడు డార్లింగ్. ప్రభాస్ ఫ్లాప్ సినిమా కూడా నార్త్ లో వంద-నూటాయాభై కోట్లు ఈజీగా కలెక్ట్ చేస్తుంది అంటే ప్రభాస్ ని నార్త్ ఆడియన్స్ ఏ రేంజులో ఓన్ చేసుకున్నారో అర్ధం చేసుకోవచ్చు. సౌత్ టు నార్త్… అమలాపురం టు అమెరికా, సెంటర్ ఏదైనా ప్రభాస్ సినిమా రిలీజ్ అవుతుంది అంటే కోట్ల వర్షం కురవాల్సిందే. టాక్ తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ నంబర్స్ చూపిస్తున్న ఏకైక హీరో ప్రభాస్ మాత్రమే అందుకే ప్రభాస్‌ ఎంత అడిగినా ఇవ్వడానికి, వంద కోట్లు స్పెండ్ చేయడానికి ప్రొడ్యూసర్స్ వెనుకాడట్లేదు. పారితోషికం విషయంలో అసలు ప్రభాస్ కి పోటీ ఉండే అవకాశమే లేదు. షారుఖ్, రజినీకాంత్ లని దాటేసి అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోగా ప్రభాస్ టాప్ ప్లేస్ లో ఉన్నాడు.

ప్రస్తుతం ‘కేజీఎఫ్’ డైరెక్టర్‌ ప్రశాంత్ నీల్‌తో కలిసి చేస్తున్న ‘సలార్’ మూవీ సెప్టెంబర్ 28న రిలీజ్‌కు రెడీ అవుతోంది. హోంబలే ఫిలింస్ సలార్ సినిమాను రెండు భాగాలుగా భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. రీసెంట్‌గా రిలీజ్ చేసిన సలార్ టీజర్‌కు భారీ రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలో సలార్ కోసం ప్రభాస్ రెమ్యూనరేషన్ ఎంత? అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఆదిపురుష్‌ సినిమాకు వంద కోట్లకు పైగా అందుకున్న ప్రభాస్, సలార్ కోసం అంతే అందుకుంటున్నట్టుగా తెలుస్తోంది. వంద కోట్ల రెమ్యునరేషన్ తో పాటు సలార్ బాక్సాఫీస్ లాభాల్లో 10% అదనంగా అందుకోబోతున్నాడట ప్రభాస్. ఈ లెక్కన ప్రభాస్ పారితోషికం ఏ రేంజ్‌లో ఉండబోబోతుందో అంటూ అంచనాలు వేసే పనిలో ఉన్నారు ట్రేడ్ వర్గాలు. సలార్ పార్ట్ 1 వెయ్యి కోట్లు, పార్ట్ 2 మరో వెయ్యి కోట్లు… మొత్తంగా రెండు సినిమాలు కలిసి రెండు వేల కోట్లు రాబడితే… ఇండియన్ సినిమా హిస్టరీలో ఇప్పటివరకూ ఏ హీరో అందుకోనంత హెయెస్ట్ రెమ్యూనరేషన్ ప్రభాస్ అందుకోవడం గ్యారెంటీ అంటున్నారు. అయినా ఆ రేంజ్ కలెక్షన్స్ రాబడుతున్న కటౌట్ కి ఆ మాత్రం ఇవ్వడంలో తప్పులేదులే.

Exit mobile version