Site icon NTV Telugu

HANU-MAN: టాలీవుడ్ యంగ్ హీరో సమరనాదం!

Hanuman

Hanuman

Teja Sajja: తొలిచిత్రం ‘అ’తోనే జాతీయ అవార్డులు అందుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ ‘హను-మాన్’ను తెరకెక్కిస్తున్నాడు. యువ కథానాయకుడు తేజ సజ్జా హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో అమృత అయ్యర్ హీరోయిన్. దీనిని శ్రీమతి చైతన్య సమర్పణలో కె. నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ సినిమా టీజర్ తేదీని మేకర్స్ సోమవారం ప్రకటించారు. నవంబర్ 15న ‘హను-మాన్’ టీజర్ విడుదల కానుంది. అనౌన్స్ మెంట్ పోస్టర్ లో రంగుల చొక్కా, పంచె ధరించి ఒక కొండపై నిలబడి సమర నాదం చేస్తూ కనిపించాడు తేజ సజ్జా! పొడవాటి జుట్టు, గడ్డం, కంప్లీట్ బాడీ ట్రాన్స్ ఫార్మేషన్ లో తేజ సజ్జా లుక్ చాలా వుంది. ఈ చిత్రంలో ప్రత్యేక శక్తులు కలిగిన సూపర్ హీరోగా తేజ కనిపించనున్నారు. వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్, రాజ్ దీపక్ శెట్టి కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ ప్రైమ్ షో ఎంటర్టైన్ మెంట్ భారీ స్థాయిలో నిర్మిస్తోంది. టాప్-గ్రేడ్ టెక్నీషియన్స్ గౌరహరి, అనుదీప్ దేవ్, కృష్ణ సౌరభ్ ఈ చిత్రానికి సౌండ్ ట్రాక్ లను అందిస్తున్నారు. దాశరధి శివేంద్ర సినిమాటోగ్రఫర్ గా వ్యవహరిస్తున్నారు.

Exit mobile version