యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ల మధ్య బావ-బావమరిది అనుకునే అంత మంచి స్నేహం ఉంది. ఇప్పుడు ఆ స్నేహంకి నిప్పు పెట్టే పనిలో ఉంది పాన్ ఇండియా బాక్సాఫీస్. ఆర్ ఆర్ ఆర్ సినిమాతో ఎన్టీఆర్, పుష్ప ది రైజ్ సినిమాతో అల్లు అర్జున్ లు ఇండియాలో సాలిడ్ ఫ్యాన్ బేస్ ని సొంతం చేసుకున్నారు. ఈ ఇద్దరూ ప్రస్తుతం పాన్ ఇండియా బాక్సాఫీస్ ని మరోసారి టార్గెట్ చేస్తూ సినిమాలు చేస్తున్నారు. ఎన్టీఆర్ దర్శకుడు కొరటాల శివతో కలిసి దేవర సినిమా చేస్తున్నాడు. జనతా గ్యారేజ్ కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ పాన్ ఇండియా రికార్డులని రిపేర్ చేయడానికి ఎన్టీఆర్ అండ్ కొరటాల శివ రెడీ అవుతున్నారు. సముద్రం బ్యాక్ డ్రాప్ లో సాలిడ్ యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్టైనర్ గా దేవర సినిమా రూపొందుతుంది. హాలీవుడ్ టెక్నీషియన్స్, బాలీవుడ్ ఆర్టిస్ట్స్ లతో దేవర సినిమా రేంజ్ ఇంకో రేంజులో ఉంది. 2024 ఏప్రిల్ 5న దేవర సినిమా రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే అఫీషియల్ గా అనౌన్స్ చేసారు. ఆ డేట్ ని మిస్ చేయకూడదనే కొరటాల శివ అగ్రెసివ్ గా షూట్ చేస్తున్నాడు. లేటెస్ట్ గా వినిపిస్తున్న న్యూస్ ప్రకారం అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా ‘పుష్ప ది రూల్’ కూడా 2024 ఏప్రిల్ నెలలోనే రిలీజ్ అవుతుందట.
పుష్ప 2పై భారీ అంచనాలు ఉన్నాయ్, ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా వెయ్యి కోట్ల మార్కెట్ ని కొల్లగొట్టడం గ్యారెంటీ. ఆ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ మైంటైన్ చేస్తున్న పుష్ప 2 సినిమాని వచ్చే ఏప్రిల్ ని రిలీజ్ చేసే ఆలోచనలో సుకుమార్ అండ్ ప్రొడ్యూసర్స్ ఉన్నారట. దేవర, పుష్ప 2 డైరెక్ట్ గా క్లాష్ అవ్వకపోవచ్చు కానీ దాదాపు రెండు మూడు వారాల గ్యాప్ లోనే ఈ రెండు సినిమాలు రిలీజ్ అయ్యే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. పాన్ ఇండియా బాక్సాఫీస్ ని టార్గెట్ చేస్తున్న రెండు సౌత్ సినిమాలు అది కూడా రెండు తెలుగు సినిమాలు కేవలం రెండు వారాల గ్యాప్ లో రిలీజ్ అవ్వడం అంటే థియేటర్స్ లో రచ్చ జరగడం గ్యారెంటీ. ఏ సినిమా ఎంత కలెక్ట్ చేసింది? ఎన్ని సెంటర్స్ లో ఆడింది? ఓపెనింగ్ డే ఎంత రాబట్టింది? ఓవరాల్ గా ఎంత ప్రాఫిట్ ఇచ్చింది అనే లెక్కలు వేసి దేవర-పుష్ప 2 సినిమాలని పోల్చి చేస్తారు. మరి ఆ వార్ లో దేవర గెలుస్తాడా లేక పుష్పరాజ్ గెలుస్తాడా అనేది తెలియాలి అంటే వచ్చే ఏడాది ఏప్రిల్ వరకూ వెయిట్ చేయాల్సిందే.