Pallavi Prashanth: బిగ్ బాస్.. రియాలిటీ షోగా బాలీవుడ్ లో మొదలై.. ఇప్పుడు అన్ని భాషల్లో విజయవంతంగా కొనసాగుతోంది. ఇక తెలుగులో ఈ షోకు ఎంత మంచి పేరు ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్టీఆర్ హోస్ట్ గా బిగ్ బాస్ సీజన్ 1 మొదలయ్యింది. ఆ తరువాత నాని సెకండ్ సీజన్ కు హోస్ట్ గా వ్యవహరించగా.. మూడోవ సీజన్ నుంచి ఏడవ సీజన్ వరకు అక్కినేని నాగార్జుననే హోస్ట్ గా వ్యవహరించాడు. ఇండస్ట్రీలో కొనసాగుతున్న సెలబ్రిటీలను.. ఒక ఇంటిలో ఉంచి వారి మధ్య గొడవలు పెట్టి.. గేమ్స్ పెట్టి.. వారిలో ఎవరు టైటిల్ విన్నరో ప్రేక్షకుల నిర్ణయానికి వదిలేస్తారు. ఇక ఇందుకోసం సదురు సెలబ్రిటీలు చాలా గట్టిగానే అందుకుంటున్నారు కూడా.. ఇక ఇవన్నీ పక్కన పెడితే.. గత ఆరు సీజన్స్ లో జరగనవన్నీ ఈ ఏడవ సీజన్ లో జరిగాయి. బిగ్ బాస్ సీజన్ 7 ఉల్టా ఫుల్టా అని అనడంతోనే ఈ సీజన్ పై ఆసక్తి నెలకొంది. మొదటి నుంచి కూడా ఈ సీజన్ లో ఎన్నో కొత్త విషయాలు జరిగాయి.
అవన్నీ పక్కన పెడితే.. రైతుబిడ్డగా ఇంట్లోకి వెళ్లిన పల్లవి ప్రశాంత్ విన్నర్ గా తిరిగి రావడం అభిమానులకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఒక కామన్ మ్యాన్ లా లోపలి వెళ్లి.. ఎంతో కష్టపడి విన్నర్ గా నిలిచాడు. ఇక బయటికి వస్తే.. అతనిని ఆదర్శంగా తీసుకొని ఎంతోమంది రైతుబిడ్డలు బాగుపడతారు అనుకున్నారు. కానీ, ఈ రైతు బిడ్డ బయటకి రావడంతోనే నిజ స్వరూపం చూపించాడు. అమర్ దీప్ కారుపై దాడి, పోలీసులతో గొడవ.. స్టూడియో బయట జరిగిన ఘర్షణల్లో కంటెస్టెంట్స్ కార్లతో పాటు ఆర్టీసీ బస్సుల అద్దాలు కూడా పగులకొట్టారు. ఇక దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయమై పల్లవి ప్రశాంత్ స్పందించాడు. అవేమి తనకు తెలియదు అని చెప్పుకొచ్చాడు. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు కొద్దిసేపటి క్రితమే ప్రశాంత్ ను అరెస్ట్ చేశారు.
ఏడు సీజన్లు.. ఇప్పటివరకు ఏ సీజన్ లో కూడా ఇలాంటి రచ్చ జరిగింది లేదు. సెకండ్ సీజన్ లో కౌశల్ పేరు మీద ఆర్మీ ఏర్పాటు చేసినా కూడా ఇంత రచ్చ జరగలేదు. అతను బయటికి వచ్చి ఇంత హంగామా చేయలేదు. బిగ్ బాస్ నుంచి బయటకి వచ్చి.. తమ కెరీర్ ను చూసుకున్నారు కానీ.. ఈ విధంగా చేసి పోలీస్ కేసు వరకు ఎవ్వరు వెళ్ళలేదు. ఇలాంటి రచ్చ చేసి.. బిగ్ బాస్ పరువు తీసిన ఏకైక మొనగాడు.. రైతు బిడ్డనే అని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ వివాదం ఎక్కడ వరకు వెళ్తుంది.. ? ప్రశాంత్ కు శిక్ష పడుతుందా.. ? లేదా .. ? అనేది తెలియాల్సి ఉంది.