Pallaburusu Teaser: నాగ చైతన్య చేతుల మీదుగా ‘పళ్ళబురుసు’ టీజర్ విడుదల.. పల్లె నేపథ్యంలో వినోదానికి గ్యారంటీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pallaburusu Teaser: గ్రామీణ నేపథ్యంలో రూపొందిన చిన్న సినిమాలు ఇటీవల ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందుతున్నాయి. ఎపిక్ స్టూడియోస్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘పళ్ళబురుసు’ కూడా అదే కోవలో వెళ్తున్నట్టే అనిపిస్తోంది. నిన్న ఈ మూవీ టీజర్‌ను హీరో నాగ చైతన్య విడుదల చేయడంతో సినిమాపై మరింత చర్చ మొదలైంది. పల్లెటూరి జీవనశైలి, సహజమైన పాత్రలు, కామెడీ థీమ్స్ తో ఈ టీజర్ తొలి చూపుతోనే ఆకట్టుకుంటోంది. కొత్త టాలెంట్ ను ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుండే నాగ చైతన్య ఈ టీజర్‌ను విడుదల చేయడం చిత్రానికి అదనపు ప్రచారాన్ని తీసుకొచ్చింది. టీజర్ ప్రారంభంలో కథానాయకుడు సంప్రదాయ వేపపుల్లతో పళ్లు తోముతుండగా గ్రామస్తులు ‘పల్లభూరుసు తేలుదా? అని అడిగే సన్నివేశం ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. అక్కడి నుంచి సినిమా పూర్తిగా గ్రామీణ వాతావరణంలోకి ప్రేక్షకులను తీసుకెళ్తుంది.
ఈ మూవీకి ఉదయ్ చౌహాన్ రచన, దర్శకత్వం వహించారు. అయితే ఆయన రూపొందించిన టీజర్లో కథలోని అసలు ట్విస్ట్‌ను బయటపెట్టకుండా, వినోదాన్ని మాత్రమే ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం కనిపిస్తుంది. ఈ సినిమాలో సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ తండ్రీకొడుకులుగా నటిస్తున్నారు. టీజర్‌ను బట్టి చూస్తే వీరిద్దరి మధ్య సాగే సరదా సంభాషణల నుంచి పుట్టే కామెడీ సినిమాకు ప్రధాన బలంగా కనిపిస్తోంది. తండ్రి టూత్‌బ్రష్ కొనివ్వమని అడుగుతుంటే, కొడుకు తన ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ ఉండే పరిస్థితిని హాస్యంగా చూపించారు. వారి మధ్య ఉండే అనుబంధం, చిన్న చిన్న గొడవలు ప్రేక్షకులను అలరించే అవకాశముంది.
Also Read
- Tollywood Item Songs: హీరోల కోసమే ఐటమ్ సాంగ్స్ చేస్తున్న స్టార్ హీరోయిన్లు.. కీర్తి సురేష్‌కి కూడా అదే కారణమా?
- Bhagyashri Borse: ‘ఆ విషయం చెబితే మా అమ్మ నన్ను వాట్సాప్‌లో బ్లాక్ చేసింది.. 6 నెలలు మాట్లాడలేదు’..
- Mani Ratnam vs RGV: అసలు విషయాన్ని బయటపెట్టిన డైరెక్టర్ అజయ్ భూపతి!
- Brahma Muhurat: "బ్రహ్మ ముహూర్తం"లో రామాయణ ట్రైలర్.. ఈ ముహూర్తం విశిష్టత ఏమిటి.?
ఇప్పటికే విడుదలైన ‘కొత్త సోకు’ జానపద గీతం ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకుంది. ఆ పాటతో సినిమాపై ఏర్పడిన ఆసక్తిని ఇప్పుడు టీజర్ మరింత పెంచింది. గ్రామీణ సంస్కృతితో రూపొందిన ఈ చిత్రం పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా నిలిచేలా కనిపిస్తోంది. ఇందులో ప్రజ్జ్వల్ యాద్మా, గోమతి లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని ఆదిత్య పిట్టి, వివేక్ కృష్ణాని ఎపిక్ స్టూడియోస్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ కూడా నిర్మాణ భాగస్వామిగా ఉంది. పవన్ సిహెచ్ సంగీతం అందిస్తున్నారు. గ్రామీణ కథలు, సహజమైన పాత్రలు, కుటుంబ హాస్యాన్ని ఇష్టపడే ప్రేక్షకులకు ‘పళ్ళబురుసు’ ఒక మంచి వినోదాత్మక చిత్రంగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సినిమా 2026 ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
- Tags
- cinema
- Pallaburusu
తాజావార్తలు
-
Pallaburusu Teaser: నాగ చైతన్య చేతుల మీదుగా ‘పళ్ళబురుసు’ టీజర్ విడుదల.. పల్లె నేపథ్యంలో వినోదానికి గ్యారంటీ!
-
US Iran War: జోర్డాన్ దాడికి ప్రతీకారం.. ఇరాన్‌పై అమెరికా దాడులు..
-
Astrology: జూలై 30 గురువారం దినఫలాలు.. ఈ రాశివారికి శుభవార్త..
-
Off The Record: కందుకూరు పాలిటిక్స్‌లో కొత్త ట్విస్ట్.. మానుగుంట మహీధర్ రెడ్డి మళ్లీ రంగంలోకి?
-
OTR : హైకోర్టు తీర్పుతో BRSకు బ్రహ్మాస్త్రమా? HYDRAపై కొత్త వ్యూహంతో గ్రేటర్ ఎన్నికలే టార్గెట్!
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో గొంతు నొప్పా? ఈ అల్లం-బెల్లం కషాయం ట్రై చేయండి.!
-
Protein Tips : పనీర్ తింటున్నారా? పచ్చిదా.. వండిందా.. ఏది బెస్ట్.?
-
7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో వచ్చేస్తున్న బడ్జెట్ ఫోన్ OnePlus N6x.!
-
AI ఫీచర్లు, Intel Core Ultra ప్రాసెసర్లతో Dell XPS 13, Dell 14S, Dell 16S, Alienware 15 ల్యాప్‌టాప్‌లు లాంచ్..!
-
Subhadeep Ghosh: టీమిండియా కొత్త కోచ్‌గా మాజీ క్రికెటర్.. ఎవరీ సుభదీప్ ఘోష్?.. అంత తోపా!