మ్యాచో హీరో గోపీచంద్ ప్రస్తుతం భారీ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఇటీవల గోపీచంద్ నటించిన ‘సీటిమార్’ ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయిన విషయం విదితమే. దీంతో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని గీతా ఆర్ట్స్ తో చేయి కలిపాడు. జీఏ2 పిక్చర్స్ & యూవీ క్రియేషన్స్ పతాకాలపై బన్నీ వాసు నిర్మిస్తున్న చిత్రం ‘పక్కా కమర్షియల్’. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మారుతీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో గోపీచంద్ సరసన రాశీఖన్నా నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ డేట్ ను మేకర్స్ ఫిక్స్ చేశారు. ‘పక్కా కమర్షియల్’ ట్రైలర్ గ్లింప్స్ తో ట్రైలర్ రిలీజ్ డేట్ ను ప్రకటించారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ గ్లింప్స్ నెట్టింట వైరల్ గా మారింది.
ఇక ఈ చిత్రంలో హీరో గోపీచంద్ లాయర్ గా కనిపించనున్నాడు. “‘మీరు కేసు ఒప్పుకునే ముందు ఫీజు వద్దు రమ్మంటారు.. పనయ్యాక వాణ్ణి వంగబెట్టి..’ అని కమెడియన్ శ్రీనివాసరెడ్డి చెప్తుండగా.. వీడియో బఫర్ అవుతున్నట్లు చూపించారు. ఏంటి ఓ నొక్కేస్తున్నారు.. మేమే కావాలని ఆపాము. ముహూర్తం టైం చూసి జూన్ 12న ఫుల్ ట్రైలర్ ను లాంచ్ చేయబోతున్నాం.. ఫుల్ గా చూసి నవ్వుకొని మమ్మల్ని ఆశీర్వదించండి అంటూ మారుతీ తన కామెడీ మార్క్ ను చూపించాడు. ఇక చివర్లో నిర్మాత అల్లు అరవింద్ ‘పక్కా కమర్షియలేయ్’ అంటూ ప్రెస్ మీట్ లో అన్న డైలాగ్ ను యాడ్ చేసి మరింత ఆసక్తి రేకెత్తించారు. ఇక ఈ సినిమాలో గోపీచంద్ అల్ట్రా స్టైలిష్ లుక్ లో ఆకట్టుకుంటుండగా.. రాశీ కళ్ళకు అద్దాలతో అచ్చమైన లాయర్ గా కనిపిస్తుంది. మొత్తానికి ఈ సినిమా పక్కా కమర్షియల్ బొమ్మ అనిపిస్తుంది. ఇక ఈ సినిమా జూలై 1 న విడుదల కానుంది. మరి ఈ సినిమాతోనైనా గోపీచంద్ హిట్ కొట్టి ట్రాక్ లో పడతాడో లేదో చూడాలి.
