Site icon NTV Telugu

Pakka Commercial: బ్లాక్ లో టికెట్లు అమ్ముతూ అడ్డంగా దొరికిపోయిన కమెడియన్

Saptagiri

Saptagiri

ఏదైనా ఒక వస్తువు కానీ, ఒక సినిమా కానీ జనాల్లోకి వెళ్ళాలి అంటే కావాల్సింది ప్రమోషన్స్.. అది లేకపోతే ఎన్నని కోట్లు పెట్టి సినిమా తీసినా ప్రేక్షకుల వద్దకు చేరదు. అయితే ఇటీవల సినిమా ఇండస్ట్రీ ప్రమోషన్స్ చేయడంలో కొత్త కొత్త పద్ధతును ప్రవేశ పెడుతోంది. వారి వారి బుర్రలకు తోచ్చిన క్రియేటివ్ ఆలోచనలకు కార్యరూపం దాల్చి తమ సినిమాలను ప్రేక్షకుల మధ్యకు పంపుతోంది. ఇక తాజాగా పక్కా కమర్షియల్ టీం కూడా కొత్త క్రియేటివ్ ఐడియాస్ తో ప్రమోషన్ల జోరును పెంచేసింది. గోపీచంద్, రాశీఖన్నా జంటగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం పక్కా కమర్షియల్.

జూలై 1 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మొదటి నుంచి ఈ సినిమా ప్రమోషన్స్ ను వెరైటీ గా ప్లాన్ చేసి ప్రేక్షకుల్లో భారీ అంచనాలు రేకెత్తించాడు దర్శకుడు మారుతి. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడడంతో ప్రమోషన్ల వేగాన్ని పెంచేసిన చిత్ర బృందం క్రియేటివిటీని పెంచేసింది. ప్రమోషన్స్ లో భాగంగా కమెడియన్ సప్తగిరి బ్లాక్ టికెట్స్ అమ్మడం కూడా మొదలుపెట్టాడు. ఒక థియేటర్ లో బ్లాక్ టికెట్లు అమ్ముతూ కనిపించిన సప్తగిరిని ఇద్దరు వ్యక్తులు మారుతి వద్దకు తీసుకొస్తారు. ఇక టికెట్స్ బ్లాక్ లో ఎందుకు అమ్ముతున్నావు అని అడుగగా.. సినిమాల్లోకి రాకముందు తాను బ్లాక్ టికెట్స్ అమ్ముకొనేవాడినని సప్తగిరి చెప్పడం విశేషం.

ఇక టికెట్స్ రూ. 150 అమ్ముతున్నానని సప్తగిరి చెప్పగా.. కౌంటర్ లో కూడా రూ. 150 కే అమ్ముతున్నారని మారుతి చెప్పుకొచ్చాడు. ఇక ఇప్పుడు మీకు అర్ధమయ్యే ఉంటుంది.. ఈ వీడియో ఎందుకు క్రియేట్ చేశారో.. తమ సినిమా కొత్తగా పెరిగిన టికెట్స్ తో కాకుండా.. పాత టికెట్స్ రేట్స్ తోనే విడుదల అవుతుందని, అందరు థియేటర్ కు వెళ్లి చూడమని మారుతి చెప్పుకొచ్చాడు. గ్రూప్ లు గా మీ స్నేహితులతో వచ్చి సినిమాను ఎంజాయ్ చేయమని చెప్పుకొచ్చాడు. మరి వీరి ప్రయత్నం ఎలా ఫలిస్తుందో చూడాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Exit mobile version