Alia Bhatt: పాకిస్థాన్ రెస్టారెంట్ ముందు వేశ్యగా అలియా భట్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సాధారణంగా ఇండియాలో ఒక సినిమాలోని పాత్రలను, పోస్టర్లను తమ బిజినెస్ పెంచుకోవడానికి కొన్ని షాపుల వారు వాడుతూ ఉంటారు. అది అందరికీ తెలిసిన విషయమే.. పార్లర్ల ముందు హీరోయిన్ ఫోటోలు, కటింగ్ షాపుల ముందు హీరోల పోస్టర్లు చూస్తూనే ఉంటాం. అందులో తప్పేమి లేదు కూడా.. అయితే ఇంతకన్నా దారుణంగా ఒక పాకిస్థాన్ రెస్టారెంట్ ప్రమోషన్ చేసింది.. అందులోనూ ఒక నటిని అవమానిస్తూ వారు చేసిన పనికి నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ నటించిన గంగూభాయ్ కతీయవాడి సినిమా ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయినా ఈ సినిమా రికార్డు కలెక్షన్ రాబట్టి 100 కోట్ల క్లబ్ లో చేరింది.
ఇక ఈ చిత్రంలో అలియా ఒక వేశ్యగా నటించిన విషయం విదితమే.. హీరోయిన్ అవుదామని సిటీకి వచ్చిన ఒక యువతి అనుకోని పరిస్థితిలో వేశ్యగా మారడం, ఆ తరువాత ఆ వేశ్యా వాటికకు లీడర్ గా మారి వారి జీవితాలను మార్చడం లాంటివి ఎంతో అద్భుతంగా చూపించాడు దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ. ఇక ఇందులో అలియా వేశ్యగా మారి కస్టమర్లను పిలుస్తున్న ఒక సీన్ ను తీసుకొని ఒక పాకిస్తాన్ రెస్టారెంట్ యాడ్ చేసింది.. స్వింగ్ అనే ఆ రెస్టారెంట్ కస్టమర్లను పెంచుకోవడానికి అలియా సీన్ ను వాడేసింది. సోమవారం రోజు పురుషులకు ప్రత్యేకమైన ఆఫర్ ఉంది రండి అన్నట్లు అలియా పిలుస్తూ ఉండడం, దాన్ని చూసి మగవారు నవ్వుతూ రావడం చూపిస్తూ ప్రకటన డిజైన్ చేశారు. ఇక ఈ ప్రకటన ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఇలాంటి నీచమైన ఐడియాలు మీకు తప్ప మరెవ్వరికీ రావు.. ఒక నటిని అంత దారుణంగా అవమానించడం దారుణమని, ఆ రెస్టారెంట్ పై తగిన చర్యలు తీసుకోవాలని అలియా ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.
Also Read
- Nithiin: టాలీవుడ్లో సరికొత్త కాంబినేషన్.. నితిన్, రుక్మిణి వసంత్‌ను కలుపుతున్న నాని!
- Disha Patani: హాలీవుడ్ ఛాన్స్ కొట్టేసిన దిశా పటాని.. భారీ థ్రిల్లర్ తో అరంగేట్రం!
- Trikala : ఏకంగా మూడు OTTలలో త్రికాల స్ట్రీమింగ్
- Lenin Box Office Collections: బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న 'లెనిన్'.. రెండు రోజుల్లోనే 37 కోట్లకు పైగా వసూళ్లు!
తాజావార్తలు
-
US-Iran War: ప్రభుత్వం vs మిలిటరీ.. హార్ముజ్ అంశంపై ఇరాన్లో అంతర్గత విభేదాలు..
-
Nithiin: టాలీవుడ్లో సరికొత్త కాంబినేషన్.. నితిన్, రుక్మిణి వసంత్‌ను కలుపుతున్న నాని!
-
Earthquake: బంగాళాఖాతంలో 4.5 తీవ్రతతో భూకంపం.. ఆంధ్రలో ప్రకంపనలు..
-
Harish Rao : సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు కౌంటర్
-
Bengaluru Crime: బెంగళూరులో దారుణం.. పార్సిల్ ఇవ్వడానికి వచ్చి పశువులా ప్రవర్తించిన కామాంధుడు! ఏం చేశాడో తెలుసా?
ట్రెండింగ్
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..