Site icon NTV Telugu

Chiranjeevi: అన్నయ్య దేవుడు.. పాకీజాను ఆదుకున్న చిరు

Chiru

Chiru

Chiranjeevi:మెగాస్టార్ చిరంజీవి.. ఆ పేరు.. కేవలం సినిమాల వరకే కాదు.. సమాజ సేవలో కూడా ఆయన మెగాస్టార్ అని తెలియజేస్తోంది. కష్టం అని అన్న వారికి కాదనకుండా ఇచ్చే చేయి అది. తెలిసి ఎన్ని సహాయాలు చేశాడో.. తెలియకుండా అంతకన్నా ఎక్కువ సాయాలు చేశాడు చిరు. అవన్నీ సందర్భానుసారం బయటకు వచ్చి ఆయన గొప్పతనం గురించి చెప్తూ ఉంటాయి. ఇక తాజాగా లేడీ కమెడియన్ పాకీజా.. చిరుయ్ చేసిన సాయం గురించి చెప్పుకొచ్చింది. ఇప్పటి యువతకు పాకీజా గురించి తెలియకపోవచ్చు కానీ, అప్పట్లో పాకీజా కామెడీచాలా ఫేమస్ అని చెప్పొచ్చు. అయితే తెలుగులో కొన్ని సినిమాలకే పరిమితమైన ఆమె కోలీవుడ్ లో ఎన్నో సినిమాలలో నటించి మెప్పించింది. ఇక కొన్నేళ్ల నుంచి పాకీజా ఆర్థిక పరిస్థితి అస్సలు బాగోలేదు. కరోనా వచ్చిన దగ్గరనుంచి ఆమె ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతోందని, ఆటోకు డబ్బులు లేక బస్సు లో వెళ్లి వస్తుందని ఒక ఛానెల్ ప్రచురించింది. ఆ తరువాత చాలామంది ఆమెకు హెల్ప్ చేయాలనీ ఇండస్ట్రీని కోరారు.

NTR 30: ఈ నెలంతా సోషల్ మీడియా హోరెత్తిపోవడం ఖాయం

ఇక పాకీజా ఆర్థిక పరిస్థితి తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి ఆమెకు రెండు లక్షలు సహాయం చేశారు. ఈ విషయాన్నీ ఆమె ఒక యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపింది. “చిరంజీవి అన్న, నాగబాబు అన్న రెండు లక్షలు ఇచ్చి నన్ను ఆదుకున్నారు.. వారు ఇచ్చిన డబ్బుతోనే నేను ఒక మంచం, ఫ్యాన్ కొనుక్కున్నాను. అంతకుముందు చాప మీదనే పడుకొనేదాన్ని. ఇప్పుడు ఆయన దయవలన నేను బతుకుతున్నాను, అన్నయ్య దేవుడు. జీవితంలో అన్నయ్య కాళ్లు పట్టుకొని కృతజ్ఞత తెలపాలని కోరుకుంటున్నాను” అని చెప్పుకొచ్చింది. ఇక ఈ వీడియో చూసిన వారు అదిరా మెగాస్టార్ అంటే అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Exit mobile version