Paidipalli Satyanand: భావిరచయితలకు మార్గదర్శి – సత్యానంద్ బాణీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Paidipalli Satyanand: ‘‘దేవుడు దేవుడిలా దిగిరాడని.. ఈ టెలిగ్రాములో దూరొచ్చాడు..’’ అంటాడు ఉరిశిక్ష నుండి బయటపడ్డ ‘మాయదారి మల్లిగాడు’. ‘‘జ్యోతీ.. దీపంలా నా గుండెలో వెలుగుతావనుకున్నాను.. కానీ, మంటవై అంటిస్తావని అనుకోలేదు..’’ అని ‘జ్యోతి’ ప్రియుడు బావురుమంటాడు. ‘‘ఈ కొండవీటి చుట్టు పక్కలా నేరాలు ఘోరాలు చేసే నీలాంటి నీచుల్ని కొట్టిన దెబ్బ కొట్టకుండా సమూలంగా సర్వనాశనం చేసే సింహాన్ని’’ అంటూ ‘కొండవీటి సింహం’ గర్జన సాగుతుంది. ఇలా సెంటిమెంట్, లవ్, ఎమోషన్‌ను తన కలం నుండి జాలువారేలా చేసిన ఘనుడు ప్రముఖ రచయిత పైడిపల్లి సత్యానంద్. ఆయనను చూడగానే, ఆ ముఖంలో సరస్వతీ కళ కనిపిస్తుంది. కథకు అనువైన మాటలు పలికించడంలో సత్యానంద్ నైపుణ్యం వినిపిస్తే, మది పులకిస్తుంది.
సత్యానంద్ పుస్తకాల పురుగు. ఇప్పటికీ ఏదో ఒక పుస్తకం పట్టుకొని కనిపిస్తారు. బాగా రాయాలంటే బాగా చదవాలి అనే మాటను తు.చ. తప్పక పాటిస్తారు. అందుకే కొందరు దర్శకులు సత్యానంద్ మాటల కోసం పరుగులు తీసేవారు. ఆయన కల్పించిన కథలకూ ప్రాధాన్యమిచ్చేవారు. ఆదుర్తి సుబ్బారావుకు కావలసిన వారు కావడంతో చిత్రసీమలో అడుగుపెట్టారు సత్యానంద్. ప్రతిభంటూ లేకపోతే, ఎవరూ ఇక్కడ రాణించలేరు. ఆదుర్తి ఓ చిన్న కథను సత్యానంద్‌కు ఇచ్చి, దానిని పెద్దగా మార్చమన్నారు. తక్కువ సమయంలోనే ఓ నవలగా ఆ కథను మలిచారు సత్యానంద్. అతనిపై గురి కుదరడంతో తాను తెరకెక్కించిన ‘మాయదారి మల్లిగాడు’ సినిమా ద్వారా రచయితగా సత్యానంద్‌ను పరిచయం చేశారు ఆదుర్తి సుబ్బారావు. కె.రాఘవేంద్రరావు రూపొందించిన ‘జ్యోతి’కి, ఎ.మోహన్ గాంధీ తొలి చిత్రం ‘అర్ధాంగి’కి, ఆ రోజుల్లో సంచలన చిత్రంగా నిలచిన ‘కలియుగ స్త్రీ’కి సత్యానంద్ రచన ఆకట్టుకుంది. యన్టీఆర్ నటించిన ‘ఎదురీత’ హిందీ చిత్రం ‘అమానుష్’ రీమేక్. దానికి సైతం సత్యానంద్ తెలుగుదనం అద్ది సంభాషణలు పలికించారు. సత్యానంద్ చిత్రసీమలో అడుగుపెట్టిన కొద్ది రోజులకే జంధ్యాల కూడా కాలుమోపారు. జంధ్యాల- సత్యానంద్ మధ్య స్నేహబంధం కుదిరింది. ఇద్దరూ కలసి కొన్ని చిత్రాలకు కథలు సమకూర్చారు. ఓ సినిమాకు సత్యానంద్ మాటలు పలికిస్తే, మరో సినిమాకు జంధ్యాల సంభాషణలు రాసేవారు. జంధ్యాల దర్శకుడైన తరువాత స్టార్ డైరెక్టర్స్ అందరూ సత్యానంద్ సంభాషణలకే ప్రాధాన్యమిచ్చారు. యన్టీఆర్ సూపర్ హిట్ మూవీస్ ‘గజదొంగ, కొండవీటి సింహం, జస్టిస్ చౌదరి’కి సత్యానంద్ రాసిన సంభాషణలు ఆ రోజుల్లో జనాన్ని భలేగా అలరించాయి. దాంతో స్టార్ హీరోస్ అందరూ సత్యానంద్ రచనకే ఓటు వేశారు.
Also Read
- Bethlehem Kudumba Unit : 'బెత్లెహం కుడుంబ యూనిట్' తెలుగు విడుదలకు అడ్డంకి
- Yasha Nagula : యూట్యూబ్‌ను షేక్ చేసిన 'యేషనాగుల'.. 5 రోజుల్లోనే 50 మిలియన్ల వ్యూస్!
- Yash Toxic: రేపు యశ్ ఫ్యాన్స్‌కు బిగ్ సర్ప్రైజ్! ‘టాక్సిక్’కు మళ్లీ థియేట్రికల్ ట్రీట్.. కానీ ఈసారి స్పెషల్ వెర్షన్
- Ravi Teja: రవితేజకు ‘ఇరుముడి’ ఏం నేర్పింది? మాస్ మహారాజాలో ఈ మార్పు ఎప్పుడూ చూడలేదు!
ప్రస్తుతం టాప్ స్టార్స్‌గా వెలుగొందుతున్న నాగార్జున, పవన్ కళ్యాణ్, మహేశ్ బాబు హీరోలుగా నటించిన తొలి చిత్రాలకు సత్యానంద్ రచన చేయడం విశేషం. ఈ ముగ్గురు హీరోలు ఈ నాటికీ స్టార్‌డమ్ చూస్తూ సాగుతున్నందుకు తనకు ఎంతో ఆనందంగా ఉందని చెబుతుంటారు సత్యానంద్. మల్లాది వెంకట కృష్ణమూర్తి రాసిన ‘మిస్టర్ వి’ నవల ఆధారంగా తెరకెక్కిన ‘ఝాన్సీ రాణి’ చిత్రానికి సత్యానంద్ దర్శకత్వం వహించారు. ఆ సినిమా అంతగా అలరించలేదు. దాంతో రచనకే పరిమితం అయ్యారు సత్యానంద్. ఇప్పటికీ ఎంతోమంది పేరున్న దర్శకులు తమకు ఏదైనా సందేహం కలిగితే, ఈ సీనియర్ రైటర్ సలహాలు, సూచనలు తీసుకుంటూ ఉంటారు. తెలుగు చిత్రసీమలో సత్యానంద్ మార్క్ డైలాగులు, వాటిలోని పవర్ తెలియాలంటే ఆయన రచన చేసిన చిత్రాలు చూస్తే చాలు. తెలుగు చిత్రసీమలో రచయితలు కావాలని ఆశించేవారు సత్యానంద్ బాణీని పరిశీలిస్తే, పరమానందం చెందడమే కాదు, తమ ఉనికినీ చాటుకొనే మార్గం తెలుసుకోగలరు.
తాజావార్తలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Off The Record: కేసీఆర్ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తారా..?
-
Nitin Gadkari: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు.. గడ్కరీ కీలక ప్రకటన
-
Trump: ముదురుతోన్న అమెరికా-కెనడా వాణిజ్య యుద్ధం.. కార్నీపై ట్రంప్ ఆగ్రహం
-
Konda Surekha : కొండా సురేఖకు ఫైనల్ షాక్.. బర్తరఫ్కు గవర్నర్ ఓకే..
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!