Bison : తమిళ స్టార్ డైరెక్టర్ పా రంజిత్ అప్పుడప్పుడు సంచలన కామెంట్లు చేస్తుంటారు. తాజాగా మరోసారి అలాంటి కామెంట్లే చేశారు. విక్రమ్ కొడుకు ధ్రువ్ విక్రమ్ హీరోగా అనుపమ హీరోయిన్ గా చేసిన బైసన్ ను పా రంజిత్ నిర్మించారు. ఈ మూవీ సక్సెస్ మీట్ లో రంజిత్ మాట్లాడారు. కాంతార లాంటి సినిమాలు సక్సెస్ అయినప్పుడు కొందరు తమిళ సినీ ప్రేక్షకులు ముగ్గురు డైరెక్టర్లను తిడుతుంటారు. మా ముగ్గురి వల్లే తమిళ ఇండస్ట్రీ పాడైపోయిందని చెబుతుంటారు. అది చాలా బాధగా అనిపిస్తుంది.
Read Also : Baahubali : శ్రీదేవి పాత్ర నాకు వచ్చిందని తెలియదు.. రమ్యకృష్ణ కామెంట్స్
గత రెండేళ్లలో తమిళంలో 600కు పైగా సినిమాలు వచ్చాయి. మరి అందులో ఏ డైరెక్టర్ తమిళ స్థాయిని పెంచగలిగాడు. ఇక్కడ ఎవరూ సినిమాలను తక్కువ చేయాలని చూడరు. అందరూ గొప్ప సినిమాలు చేయాలనే ఆరాటపడుతారు. కానీ అన్ని సార్లు అది వర్కౌట్ కాకపోవచ్చు. కానీ గతం మర్చిపోకూడదు. నేను తీసిన కబాలి సినిమాలో కొన్ని లోపాలు ఉన్నాయి. దానికి ఒప్పుకుంటాను. కానీ అది లాభాలు తెచ్చిపెట్టింది. ఆ ట్రోల్స్ నన్ను చాలా బాధపెట్టాయి అంటూ తెలిపాడు పా.రంజిత్.
Read Also : Naga Vamsi : కింగ్ డమ్ ప్లాప్ కాదు.. నాగవంశీ ఫస్ట్ రియాక్షన్
